Begin typing your search above and press return to search.

వారి పాలిటిక్స్ పై గురువుగారి వ్యూ

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:42 AM GMT
వారి పాలిటిక్స్ పై గురువుగారి వ్యూ
X
మన దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని స్థాయిలో తమిళ రాజకీయాలు సినిమాలతో లింక్ అయి ఉంటాయి. ఎటో ఒకవైపు సినిమాకి లింక్ ఉండడం వేరు కానీ.. అధికార-ప్రతిపక్షాలు సినిమావాళ్లే కావడం అక్కడ మాత్రమే కనిపించే దృశ్యం. ఇప్పటికే ఐదుగురు సినిమా పర్సన్స్ ముఖ్యమంత్రులు అయ్యారక్కడ.

ఇప్పటికే రెండు పక్షాలు ఫిలిం పర్సనాలిటీస్ కాగా.. విజయ్ కాంత్ కూడా ఓ పార్టీ పెట్టి కొంత హంగామా చేశాడు. ఇప్పుడు స్టార్ హీరోలు రజినీకాంత్.. కమల్ హాసన్ కూడా సొంత పార్టీలు ప్రకటించారు. అంటే పోటీపడే పార్టీలు అన్నీ పార్టీలు సినిమావాళ్లవే అన్నమాట. ఈ సిట్యుయేషన్ పై.. రజినీకాంత్- కమల్ హాసన్ ఇద్దరికీ ఆరంభంలో సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు భారతీ రాజా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వీరిద్దరిని కుర్రాళ్ల వయసు నుంచి చూసిన ఆయనకు.. వారి గురించి పూర్తిగా తెలుసు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఫిలింమేకర్ గానే ఉండాలని భావించడంతో అటు వైపు ఆలోచించనే లేదన్నారు భారతీ రాజా.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెచ్చవచ్చని.. వారిద్దరికీ జనాలకు ఏదో చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి.. పార్టీ ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయడం సరైన ఆలోచనే అన్నారు భారతీ రాజా. అయితే.. వీరిద్దరిలో ఎవరికి తను మద్దతు ఇస్తాననే అంశానికి ఇప్పుడే జవాబు చెప్పలేనని.. వారి పార్టీ సిద్ధాంతాలు ప్రకటించాక ఆలోచిస్తానని చెప్పారు ఈ దిగ్గజ ఫిలిం మేకర్.