Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడి ఫైర్

By:  Tupaki Desk   |   25 July 2018 12:42 PM IST
శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడి ఫైర్
X
కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో రచ్చ చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటూ తమిళ సినీ పరిశ్రమను బజారు కీడ్చే పనిలో బిజీగా ఉంది. ఆమె పలువురు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలు కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. తమిళ ప్రముఖ దర్శకుడు మురగదాస్ - సుందర్ సి - నటుడు శ్రీరామ్ వంటి వారు అవకాశాల కోసం తనను వాడుకున్నారంటూ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై తమిళ సినీ ప్రముఖులంతా ఏకమయ్యారు. శ్రీరెడ్డిపై నటుడు వారాహి చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశాడు..

శ్రీరెడ్డి చేస్తున్న రచ్చపై తాజాగా తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా స్పందించారు. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని.. అది అందరూ గుర్తించాలని అన్నారు. అలాంటిది ఆమె వాటితో ప్రచారం పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. సినిమా వారినందరినీ తప్పుపట్టడం శ్రీరెడ్డికి సరికాదని భారతీరాజా హెచ్చరించారు.