Begin typing your search above and press return to search.

26న మహేష్‌ తొలి ప్రమాణం!!

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:56 AM
26న మహేష్‌ తొలి ప్రమాణం!!
X
ఎప్పటినుండో అందరూ వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. కాని సంక్రాంతికి రావాల్సిన మహేష్‌ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ మాత్రం రాలేదు. అయితే అటు రంగస్థలం సినిమా నుండి ఎలాంటి తరహాలో సంక్రాంతి నాడు ఒక ప్రకటన వచ్చిందో.. ఇప్పుడు సమ్మర్ బొనాంజాగా రాబోతున్న మహేష్‌ అండ్ హ్యాటిక్ హిట్స్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ సినిమా గురించి కూడా అదే విధమైన ప్రకటన ఒకటి వెలువడింది.

'జనవరి 26న మహేష్‌ బాబు ప్రమాణం చేయబోతున్నాడు' అంటూ ఇప్పుడు ఒక టీజర్ పోస్టర్ రిలీజ్ చేశారు మహేష్‌ సినిమా మేకర్స్. అక్కడ పోస్టర్ పై ఉన్న అక్షరాలు.. చూస్తుంటే.. కచ్చితంగా అదొక ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారంకు సంబంధించిన స్పీచ్ అని చెప్పొచ్చు. అంటే మనోడు నిజంగానే ''భరత్ అను.. నేను'' అంటూ ప్రమాణం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. ఎన్నాళ్ళనుండో ఈ సినిమా లుక్ రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది నిజంగానే సూపర్బ్ న్యూస్.

కొరటాల డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రియల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్‌ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నటిస్తుంటే.. అతని గాళ్‌ ఫ్రెండ్ బాలీవుడ్ బ్యూటి కియారా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి చూపు కోసం.. అదేనండీ తొలి ప్రమాణం కోసం.. వెయిట్ చేద్దాం.