Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పుష్కర కాలం అయినా అదే అందం

By:  Tupaki Desk   |   28 Jun 2021 2:30 AM GMT
పిక్ టాక్ : పుష్కర కాలం అయినా అదే అందం
X
హీరోయిన్స్‌ ఆఫర్లు వచ్చినంత కాలం మాత్రమే వర్కౌట్లు చేస్తూ అందంగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడైతే సినిమాల్లో ఆఫర్లు తగ్గుతాయో తమ అందం మరియు ఫిజిక్ పై దృష్టి పెట్టడం మానేస్తారు. తద్వారా వారి అందం మెల్ల మెల్లగా అంతరించి పోతూ కొన్నాళ్ల తర్వాత ఈమె ఆమేనా అన్న రీతిలో మారిపోతుంది. కాని కొందరు హీరోయిన్స్ మాత్రం మెయింటెన్‌ చేయకున్నా.. వర్కౌట్‌ చేయకున్నా అందంగానే కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్‌ గా పరిచయం అయ్యి పుష్కర కాలం అయినా ఇప్పటికి అదే తరహా అందంతో భానుశ్రీ కనిపిస్తుంది. తాజాగా ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్‌.. గుణశేఖర్‌ ల కాంబినేషన్‌ లో వచ్చిన వరుడు సినిమా తో భానుశ్రీ పరిచయం అయ్యింది. సినిమాలో హీరో హీరోయిన్‌ ఒకరిని ఒకరు చూసుకోవద్దని అనుకుంటారు. ఆ కాన్సెప్ట్‌ ను ప్రమోషన్ సమయంలో కూడా ప్రయోగించారు. వరుడు సినిమాలో వధువుగా నటించింది ఎవరు అనే విషయాన్ని బయటకు చెప్పకుండా ప్రమోషన్స్‌ చేశారు. ఆ సమయంలో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను సినిమా అందుకోలేక పోయింది. భానుశ్రీ స్క్రీన్‌ స్పెస్ చాలా తక్కువ ఉండటంతో పాటు సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు ఆఫర్లు గగనం అయ్యాయి.

ఈ పదేళ్లు అనేక విధాలుగా ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేదు. అయినా కూడా ఈమె ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇన్నేళ్ల కాలంలో భాను శ్రీ ఎప్పుడు కూడా ఒకే తరహాగా కనిపిస్తూ వస్తోంది. తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో కూడా ఆమె అప్పట్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందే అనేలా ఉంది. అందం తగ్గక పోవడంతో పాటు ఆమె ఫిజిక్ విషయంలో కూడా మార్పు రాలేదు. కనుక ఇప్పటికి అయినా అదృష్టం కలిసి వస్తే మళ్లీ హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాలి.