Begin typing your search above and press return to search.

బుల్లితెరపై క్లాసిక్ బ్యూటి తెరంగేట్రం

By:  Tupaki Desk   |   5 Oct 2016 10:30 PM GMT
బుల్లితెరపై క్లాసిక్ బ్యూటి తెరంగేట్రం
X
మాజీ హీరోయిన్ భానుప్రియకు సౌత్ లో బోలెడంత క్రేజ్ ఉంది. దక్షిణాదిలోని 4 భాషల్లో నటించిన అనుభవం ఈ క్లాసిక్ హీరోయిన్ కు ఉంది. ఇప్పటివరకూ 150 సినిమాల్లో నటించిన భానుప్రియ.. స్వతహాగా డ్యాన్సర్ కూడా. ఇప్పటివరకూ వెండితెరపై వెలుగులు విరజిమ్మిన ఈ సీనియర్ నటి.. ఇప్పుడు బుల్లితెరపైకి వస్తోంది. నాతి చరామి అనే సీరియల్ తో తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెడుతోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీగా నడిచే ఈ సీరియల్ లో భానుప్రియదే ప్రధాన పాత్ర కాగా.. ఆమెకు జంటగా పోటీగా నటిస్తున్నాడు మరో సీనియర్ నటుడు సురేష్. తెలుగు సీరియల్స్ లో ఈ నాతిచరామి సంథింగ్ స్పెషల్ అంటున్నారు.

బడ్జెట్ పరంగా చూసుకుంటే.. ఇప్పటి వరకూ తెలుగు బుల్లితెరపై ఎన్నడూ ఖర్చు చేయని రేంజ్ లో ఈ సీరియల్ కోసం బడ్జెట్ పెడుతున్నారట. ఈ సీరియల్ తర్వాత భానుప్రియ తెలుగులో కూడా ఫుల్లు బిజీ అయిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం సీరియల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న జోనర్ అయిన.. ఫ్యామిలీ సెంటిమెంట్.. రిలేషన్స్ యాంగిల్ లోనే ఈ నాతి చరామి సాగనుంది.గత 30 ఏళ్లుగా సినీరంగంలో ఉన్న భానుప్రియ ఇమేజ్.. ఈ సీరియల్ కు బాగా ఉపయోగపడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ కానున్న నాతిచరామి.. తెలుగు సీరియల్స్ లో కొత్త రికార్డులకు వేదిక అవుతుందని నిర్మాతలు బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/