Begin typing your search above and press return to search.

మహానటి కోసం మరో సీనియర్ నటి

By:  Tupaki Desk   |   19 March 2018 2:30 PM GMT
మహానటి కోసం మరో సీనియర్ నటి
X
బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమాల షూటింగ్స్ ఎలా జరిగేవి అనేది మనకు ఎక్కువగా తెలియదు. అప్పటి తారలు చెప్పడమే గాని అందుకు సంబందించిన బిహైండ్ సీన్స్ కి సంబందించి క్లిప్పింగ్స్ కూడా ఎక్కువ లేవు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు సంబందించిన అలనాటి తెరవెనుక సంగతులు తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆ విషయాలను మహానటి సినిమా ద్వారా కొంత అయినా తెలుసుకోవచ్చు.

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మహానటి సినిమాపై ప్రస్తుతం అంచనాలు భారీగా ఉన్నాయి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకే సారి సినిమాను తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక అసలు విషయానికి వస్తే.. సీనియర్ హీరోయిన్ భాను ప్రియ సినిమా లో ఒక భాగం కానుంది. తమిళ్ లో ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పనుందట. అయితే నడిగాయర్ పేరుతో గ్రేట్ యాక్టర్స్ కి శ్రద్ధాంజలి అందించాలని ముందుగా ఆమెతో ఒక వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారట.

ప్రస్తుతం ఆ పనుల్లో భాను ప్రియ బిజీగా ఉన్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు తెలిపారు. ఇక సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ - విజదేవరకొండ అలాగే సమంత - షాలిని పాండే దర్శకులు క్రిష్ - తరుణ్ భాస్కర్ తో పాటు సీనియర్ నటులు మోహన్ బాబు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మే 9న మహానటి సినిమా విడుదల కానుంది.