Begin typing your search above and press return to search.

సుమన్​ నా జీవితాన్ని కాపాడాడు.. బ్లూఫిల్మ్​ వివాదం పై స్పందించిన భానుచందర్​

By:  Tupaki Desk   |   3 Dec 2020 5:00 AM IST
సుమన్​ నా జీవితాన్ని కాపాడాడు..  బ్లూఫిల్మ్​ వివాదం పై స్పందించిన భానుచందర్​
X
సుమన్​ ఒకప్పుడు తెలుగులో స్టార్​హీరో. ఇప్పుడున్న అగ్రహీరోలతో సమానంగా సుమన్​కు ఎక్కువ క్రేజ్​ ఉండేది. కానీ కొంతమంది కుట్రవల్ల సుమన్​ బ్లూఫిల్మ్​ కేసులో ఇరుక్కున్నాడు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సుమన్​ కెరీర్​ ను నాశనం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ పెద్దహీరో పేరు కూడా వినిపించింది. బ్లూఫిల్మ్​ కేసులో జైలుకెళ్లాక సుమన్​ కెరీర్​ నాశనమైంది. ఆ తర్వాత అతడు చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. బ్లూఫిల్మ్​ వివాదం పై సుమన్​ ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు.

తనపై కుట్రచేసి జైలుకు పంపించిన మాట నిజమేకానీ.. ఆ కుట్రలో సినిమావాళ్లు ఎవరూ లేరని.. బయటి వాళ్లే ఉన్నారని సుమన్​ చాలా సార్లు చెప్పాడు. అయితే తాజాగా ఓ టీవీచానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్​ మరోసారి ఈ విషయంపై స్పందించారు. ఇటీవల ఓ టీవీ చానల్​కు సుమన్​ అతడి ప్రాణమిత్రుడు ప్రముఖ హీరో భానుచందర్​ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సుమన్​.. భానుచందర్​ గురించి చాలా విషయాలు చెప్పాడు. తమిళంలో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న తనను భానుచందరే తెలుగు తెరకు పరిచయం చేశాడని చెప్పాడు సుమన్​. అప్పట్లో సుమన్ ఫైట్లకు మాస్​జనంలో విపరీతమైన ఫాలోయింగ్​ ఉండేది. మార్షల్​ ఆర్ట్స్​ చేసిన సుమన్​ చేసే ఫైట్స్​ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా కొద్దిరోజుల్లోనే సుమన్​ తెలుగునాట ప్రముఖ హీరోగా ఎదిగాడు. అతడి కెరీర్​ పీక్స్​లో ఉన్నప్పుడే బ్లూఫిల్మ్​ కేసు తెరమీదకు వచ్చింది.

ఈ విషయంపై సుమన్​ మాట్లాడుతూ.. ‘ నా స్నేహితుడైన దివాకర్​ అనే వ్యక్తి నన్ను ఈ కేసులో ఇరికించాడు. ఈ కేసుతో ఇండస్ట్రీ కి ఏ విధమైన సంబంధం లేదు’ అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఈ కేసులో భాను చందర్‌ ను కూడా ఇరికించేందుకు కుట్ర చేశారు. కానీ నేను సమయ స్ఫూర్తితో వ్యవహరించి అతడి పేరు బయటకు రాకుండా చేశాను’ అని సుమన్​ చెప్పాడు. ఈ విషయంపై భానుచందర్ మాట్లాడుతూ.. సుమన్​ తన జీవితాన్ని నిలబెట్టాడని చెప్పారు. బాపు​-రమణల్లాగా తమది కూడా గొప్ప స్నేహమని చెప్పారు. ఈ రోజుల్లో కేవలం అవసరాల కోసం స్నేహం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.