Begin typing your search above and press return to search.
'శ్రీకారం' కోసం పెంచల్ దాస్ పాడిన 'భలేగుంది బాలా' సాంగ్..!
By: Tupaki Desk | 5 Nov 2020 11:30 PM ISTటాలీవుడ్ యువ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ''శ్రీకారం''. కిశోర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో 'శ్రీకారం' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. తాజాగా 'భలేగుంది బాలా' సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించడంతో పాటు ఆలపించారు.
'వచ్చానంటివో.. పోతానంటివో.. వగలు పలుకుతావే.. కట్టమీద పోయే అలకల సిలికా.. భలేగుంది బాలా..' అంటూ సాగిన ఈ పాటను పెంచల్ దాస్ పల్లెటూరి యాసలో తనదైన శైలిలో పాడినట్లు అర్థం అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టు ఈ ట్యూన్ అందించాడు. ఇందులో పంచెకట్టుతో కనిపిస్తుండగా.. ప్రియాంక మోహన్ లంగావోణీ లో పల్లెటూరి అమ్మాయిలా వయ్యారంగా నడుస్తూ కనిపిస్తోంది. 'భలేగుంది బాలా' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 9న విడుదల చేయనున్నారు. కాగా, 'శ్రీకారం' సినిమాలో శర్వానంద్ యువ రైతు పాత్రలో కనిపించనున్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని ఇటీవలే తిరుపతిలో తిరిగి ప్రారంభించి తగు జాగ్రత్తలతో షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళి శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.