Begin typing your search above and press return to search.

భలే మంచి రోజు పాటల రివ్యూ !

By:  Tupaki Desk   |   18 Dec 2015 6:17 AM GMT
భలే మంచి రోజు పాటల రివ్యూ !
X
విజయ్ మరియు శశిధర్ దేవిరెడ్డి లు నిర్మాతలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో సుదీర్ బాబు హీరో గా రూపుదిద్దుకొని డిసెంబర్ 25 న విడుదలకు సిద్దమయిన భలే మంచి రోజు సినిమా పాటలు చాలా బాగున్నాయి . ఈ మద్య ఆడియో రిలీజ్ అయి పాటలు బాగా పాపులర్ అవడం తో ఈ సినిమా బాక్స్ ఆఫీసు విజయం పై భారి అంచనాలు ఏర్పడ్డాయి .

ఈ సినిమా కి సంగీత దర్శకుడు ఎమ్. ఆర్. సన్నీ సరికొత్త ట్యూన్ లతో మరియులిరిక్ రైటర్ కృష్ణ కాంత్ ... గారు చాలా మంచి సాహిత్యం ఇచ్చారు . దాదాపు అన్ని పాటలు బాగున్నా ఈ క్రింది మూడు పాటలు ట్యూన్స్ మరియు సాహిత్యం విన సొంపుగా వున్నది.

టాప్ 3 సాంగ్స్ :

సాంగ్ 1: సింగర్ : అర్జిత్ సింగ్
అనుకొన్న వన్ని జరగనప్పుడు,అనుకోని విపత్తులు ,ఇబ్బందులు వచ్చినపుడు ... నిరాశకు గురైనప్పుడు ... మన మనసు పరి పరి విధాలుగా పరితాపం చెందుతుంది .. దాని తీరు తెన్నులు వర్ణిస్తూ ధైర్యం నూరి పొసే పాట తప్పక వినాల్చిందే !

"...నింగే కూలిందా నీరై గుండే జారిందా !
చీకటి చినుకై రాలిందా చిటికెలో చీకటి చేసిందా !
నేలే తూలిందా దారే అడుగుని అడిగిందా !
గమ్యం తడబడి ఆగిందా బ్రతుకే శూన్యం అయిందా !
మబ్బే కాదన్నా మొత్తం నింగే నీదిరా !
ఊరే పొమ్మన్నా మొత్తం నేలంతా నీదేరా !...."

సాంగ్ 2: మిల ... మిల పాట సినిమా లో కెల్లా గుర్తుండి పొయ్యే సాంగ్ ...
సింగర్ : శాశ్వత్ సింగ్ ...
కిలకిల కిలకిల .....కిలకిల కిలకిల ...
నవ్వేసిందే కిల కిల కోకిలా ....

....మెరిసే మనసే ... నీ చెయ్ తగిలే ...
. మిల మిల మిల మిల
ఉపిరి సోకిన హాయి మిగిలే !
మిల మిల మిల మిల...

సాంగ్ 3: సింగర్ : అర్జిత్ సింగ్
స్లో మెలోడీ... కాని హృదయాన్ని హత్తుకొనేలా .. లిరిక్స్ ... అదేవిదంగా ట్యూన్స్ ...

"ఎవరి రూపం మదిలో మెదిలే ...
ఎవరి వైపో మదిలా కదిలే ....
తీరే తీరే కాలనే కనే కోరే కోరే తన రాకనే ...

మాస్ సాంగ్స్ :
1)చల్తికా నాం ఘాడి .... దొరికేస్తుందా బంగరు లేడీ
వున్నారా ఒక్కడు ఐనా .....

2) డొల్ డోలారే ...
3) వారేవా ఒరే మచా ...వేడుకే కరో రచ్చా ...
4) టైటిల్ సాంగ్ : భలే మంచి రోజు ... వినడానికి మ్యూజిక్ కొత్త ట్యూన్ తో డిఫరెంట్ గా వున్నది..