Begin typing your search above and press return to search.

బాసు.. మెమరీ నిల్.. ఎంటర్-టైన్మెంట్ ఫుల్..

By:  Tupaki Desk   |   3 Aug 2015 7:24 PM IST


ఒక చిన్న ట్రైలర్ లో టోటల్ ఫిలిం ఇండస్ట్రీ ని తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు మన మారుతి. పైగా గురుడు సినిమాల్లోకి రాకముందు యాడ్ ఫిలిం మేకర్ కూడా. సో, ఎవర్ని ఎలా ఆకట్టుకోవాలి అనే టెక్నిక్స్ పై ఒక పెద్ద డిక్షనరీ ఉండే ఉంటుంది మనోడి దగ్గర. సరిగ్గా అలాంటి ఒక ఫార్ములా వాడుకొని ఇప్పుడు హీరో నాని ని ప్రేక్షకుల ముందుకు తీస్కోస్తున్నాడు. పదండి ఓ లుక్కేద్దాం.

నాని హీరోగా, అందాల రాక్షసి లావణ్య త్రిపాటి హీరోయిన్ గా మారుతి ఒక సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు భలే భలే మగాడివోయి. మరి నాని వంటి మగాడు అక్కడ నుంచొని భీబత్సమైన రొమాన్స్ కం కామెడీ చేస్తుంటే ఇంకేమంటారు ఎవరైనా.. భలే భలే మగాదివోయి అనే అంటారు. ఇకపోతే ఇవాళ ఈ సినిమా మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చెప్పుకునే విజువల్స్ ఎమీ లేవు కాని, మాట్లాడుకోవడానికి మాంచి సరకు వుంది.

మెమరీ నిల్.. ఎంటర్ టైన్మెంట్ ఫుల్.. అనే కాన్సెప్ట్ తో మనోడు ఈ సినిమాను తీసినట్లు చెప్పేసాడు. దాని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఈ సినిమాలో కామెడీ ఎలా వుంటుందో.. అయితే సినిమాలో నాని మెమరీ లాస్ పేషెంట్ అంటారా? కిక్ రవి తేజను చూసి ప్రేరణ పొందాడని అనుకోవాలా మనం? ఏదేమైనా మోషన్ పోస్టర్ మాత్రం కిక్ ఇచ్చిందిలే.