Begin typing your search above and press return to search.

'ఆచార్య' కు పోటీగా బరిలోకి ‘భళా తందనాన’..!

By:  Tupaki Desk   |   22 April 2022 9:30 AM GMT
ఆచార్య కు పోటీగా బరిలోకి ‘భళా తందనాన’..!
X
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ''భళా తందనాన''. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో 'కేజీఎఫ్' ఫేమ్ గరుడ రామచంద్రరాజు విలన్ గా కనిపించనున్నారు.

ఇప్పటికే 'భళా తందనాన' సినిమా నుంచి విడుదలైన టీజర్ మరియు రెండు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేశారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని మేకర్స్ 'భళా తందనాన' సినిమాని వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారని అర్థం అవుతుంది. దీనికి మే 3న రంజాన్ పండగ కూడా మరో అడ్వాంటేజ్ అవుతుంది.

కాకపోతే ఏప్రిల్ 29న చిరంజీవి - రాంచరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా విడుదలవుతోంది. మెగా మూవీకి పోటీగా నిలబడి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. శ్రీ విష్ణు కెరీర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

''భళా తందనాన'' చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి - సత్య - పోసాని కృష్ణ మురళి - అయ్యప్ప పి శర్మ - చైతన్య కృష్ణ - రవి వర్మ - శ్రీకాంత్ అయ్యంగార్ - ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ విస్సా సంభాషణలు రాశారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఈ సినిమాలోని యాక్షన్ పార్ట్‌ ను పర్యవేక్షించారు.