Begin typing your search above and press return to search.

శ్రీ‌రాముడి చెంత భ‌క్త‌ హ‌నుమాన్ లా!

By:  Tupaki Desk   |   23 Nov 2019 4:29 PM IST
శ్రీ‌రాముడి చెంత భ‌క్త‌ హ‌నుమాన్ లా!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడు! అని ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ చేసిన కామెంట్ ఎంత‌గా వైర‌ల్ అయ్యింతో తెలిసిందే. మ‌హేష్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన మాట ఇది. ఆ త‌ర్వాత ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ కూల్ అయిపోవ‌డం .. దానిని మ‌హేష్ లైట్ తీస్కోవ‌డం వ‌గైరా ఎపిసోడ్స్ తెలిసిందే.

అదంతా అటుంచితే ప్ర‌స్తుతం మ‌హేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడితో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ప‌టాస్ - రాజా ది గ్రేట్- ఎఫ్ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో రావిపూడి కెరీర్ పీక్స్ లో ఉంది. జంధ్యాల‌.. ఈవీవీ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో కామెడీ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ కి హ్యాట్రిక్ హిట్ అందించ‌డ‌మే ధ్యేయంగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి ప‌ని చేస్తున్నాడు అనీల్ రావిపూడి. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు స‌హా టీజ‌ర్ అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. నిన్న రిలీజైన టీజ‌ర్ కి అభిమానుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. స‌రిలేరు టీజ‌ర్ ఇస్మార్ట్ గా ఉంది భ‌య్యా! అంటూ ఇస్మార్ట్ హీరో రామ్ సైతం అనీల్ రావిపూడికి ట్వీట్ చేశారు. బాబీ .. అనీల్ సుంక‌ర స‌హా ప‌లువురు ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ఈ టీజ‌ర్ ని ప్ర‌శంసించారు.

నేడు (న‌వంబ‌ర్ 23) అనీల్ రావిపూడి బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంతో ప్ర‌త్యేకంగా విష్ చేశారు. సంతోషం.. స‌క్సెస్ మాత్ర‌మే కాదు చాలా చాలా బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకో! అంటూ స్పెష‌ల్ గా విషెస్ తెల‌ప‌డం ఆస‌క్తిక‌రం. నీతో క‌లిసి ప‌నిచేయ‌డం అద్భుత‌మైన అనుభ‌వం అంటూ పొగిడేశారు మ‌హేష్. ఇక ఈ బ‌ర్త్ డే బోయ్ కి సినిమా అయిన వెంట‌నే ఇంకో సినిమా చేస్తాన‌ని మ‌హేష్ మాటిచ్చార‌ని ప్ర‌చారం అవుతోంది. మ‌రి మ‌హేష్ 26 త‌ర్వాత కూడా అనీల్ రావిపూడితోనే ఉంటుందా? లేక త‌న క్యూలో ఉన్న ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తాడా? అన్న‌ది చూడాలి.

బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడికి బ‌ర్త్ డే విషెస్ చెబుతూ మ‌హేష్ షేర్ చేసిన ఫోటో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కంపార్ట్ మెంట్ లో మ‌హేష్‌ చెంత‌నే నేల‌పై కూచుని ఉన్న అనీల్ రావిపూడిని చూడ‌గానే శ్రీ‌రాముడి చెంత కూచుని భ‌క్తిగా ఆరాధన‌గా చూస్తున్న ప‌ర‌మ‌భ‌క్త హ‌నుమంతుడిలా క‌నిపిస్తున్నాడు రావిపూడి. ఇంకో కోణంలో చూస్తే త‌న స్నేహితుడు శ్రీ‌కృష్ణుడి కోసం అటుకుల మూట తెచ్చిన కుచేలుడిలాగా క‌నిపిస్తున్నాడు. ఇంత‌కీ ఆ ప‌క్క‌నే సంచిలో ఏముందో అనీల్ రావిపూడినే చెప్పాలి మ‌రి!