Begin typing your search above and press return to search.

భక్త కన్నప్ప.. ఆగిపోయినట్లేనా?

By:  Tupaki Desk   |   5 July 2016 12:05 PM IST
భక్త కన్నప్ప.. ఆగిపోయినట్లేనా?
X
క్రేజీ అనుకున్న కొన్ని ప్రాజెక్టులు అసలు ప్రారంభం కావడానికే చాలా టైమ్ తీసుకుంటాయి. కొన్నయితే సెట్స్ పైకి కూడా వెళ్లకుండానే ఆగిపోతుంటాయి. తనికెళ్ల భరణి తలపెట్టిన భక్త కన్నప్ప పరిస్థితి ఇలాగే ఉంది. అప్పట్లో కృష్ణంరాజు చేసిన ఈ సినిమాను.. లేటెస్ట్ జనరేషన్ కి తగినట్లుగా మరింత వివరంగా తీయాలన్నది భరణి ఆలోచన. మొదట సునీల్ హీరోగా భక్త కన్నప్ప తీయాలని భావించినా.. బడ్జెట్ సమస్యలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

సునీల్ హీరోగా తీసినా కనీసం 25 కోట్ల లెక్క తేలడంతో.. నిర్మాతలు వెనక్కి తగ్గారని అంటున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును చేసేందుకు మంచు విష్ణు ఇంట్రెస్ట్ చూపించాడు. బడ్జెట్ ఎక్కువైనా సరే తనే తీయాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది అనౌన్స్ చేశాడు కూడా. భక్త కన్నప్పను ఇంటర్నేషనల్ ఫిలిమ్ రేంజ్ లో తీసేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో చర్చలు కూడా జరిగాయి. అంతా అయ్యాక లెక్కలు చూస్తే బడ్జెట్ 50 కోట్లకు చేరుకుందిట. దీంతో ఇంత భారీగా ఖర్చుపెట్టి కన్నప్పను తెరకెక్కించడం అవసరమా అనే ఆలోచనకు వచ్చాడట విష్ణు.

దీంతో భక్త కన్నప్ప ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దగ్గరే ఆగిపోయిందని అంటున్నారు. ఇది కాకుండా విష్ణుకు తన తండ్రి మోహన్ బాబు ప్రధాన పాత్రలో రావణ బ్రహ్మ సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఇది కూడా బడ్జెట్ ఎక్కువ కావడం.. అంత మొత్తం రికవరీ చేయడం కష్టం కావడం అనే ఆలోచనతోనే ఆగిపోయిందని అంటున్నారు.