Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: వర్మ సమేత భైరవగీత
By: Tupaki Desk | 3 Nov 2018 7:51 PM ISTరామ్ గోపాల్ వర్మ సమర్పణలో అయన శిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'భైరవగీత'. సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇంటెన్స్ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది.
"రాములోరు జింకెంటబడి బోతెనేగా రావణుడొచ్చి సీతమ్మోరిని ఎత్తుకుబోయాడు.. ఇప్పుడు ఈ గీతమ్మోరిని ఎవడైనా వచ్చి ఎత్తుకుబోతే ఏంజేసేదె".. ఈ డైలాగ్ తో స్టొరీ ఎలా సాగుతుందో ఒక హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇక హీరో - హీరోయిన్ మధ్య రొమాంటిక్ షాట్స్.. బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. హీరో ఫ్యాక్షనిస్ట్ సుబ్బారెడ్డి కి నమ్మినబంటు. ప్రాణాలిస్తాడు.. అవసరమైతే తీస్తాడు. ఇక సుబ్బారెడ్డి ఫ్యామిలీ లోనే ఒక రావణుడు.. హీరోయిన్ పై కన్నేస్తాడు.. ఇక సీమ రక్తపాతం స్టార్ట్.
హీరో హీరోయిన్లు ఎస్కేప్ కావడం... విలన్ గ్యాంగ్ హీరో ఫ్యామిలీ ని టార్గెట్ చేయడంతో ఇక తప్పనిసరిపరిస్థితుల్లో వారి మీద తిరగబడి జనాలను పోగేస్తాడు. "ఆలోచనని ఆలోచించిన మనిషిని చంపలేనప్పుడు ఏం జెయ్యాల?" అని సుబ్బారెడ్డి పాత్ర తన అసిస్టెంట్ ను అడిగితే "ఆ ఆలోచనకు కారణం అయిన మనిషిని చంపెయ్యాల" అంటూ సలహా ఇస్తాడు. "సాటిమనిషిని బానిసలాగా చూడాలంటే నీ గుండెలదరాల" అంటూ విలన్ ను ఉద్దేశించి హీరో చెప్పే డైలాగ్ కూడా బాగుంది.
సీన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. సీమ యాస కూడా చాలా అథెంటిక్ గా ఉంది. సీమ లోకేషన్స్ ను పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. సీమ ఫ్యాక్షన్.. అందులోనూ వర్మ స్కూల్ దర్శకుడు కాబట్టి వయోలెన్స్ డోస్ మోతాదుకు మించే ఉంది. ఓవరాల్ గా టాలీవుడ్ కి మరో బోల్డ్ ఫిలిం గ్యారెంటీ. ధనంజయ్.. ఇర్రా మోర్ లో హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా నవంబర్ 22 న రిలీజ్ కానుంది. అంతలోపు ఓసారి సీమ రక్తపు రచ్చపై ఓ లుక్కేయండి.