Begin typing your search above and press return to search.

విదేశీ హోట‌ల్ లో ప్రియురాలితో చిక్కిన‌ భాయ్!

By:  Tupaki Desk   |   1 Sep 2021 1:30 AM GMT
విదేశీ హోట‌ల్ లో ప్రియురాలితో చిక్కిన‌ భాయ్!
X
ఇటీవ‌లే `రాధే-యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` ఫెయిల్యూర్ స‌ల్మాన్ ఖాన్ ని తీవ్రంగా నిరాశప‌రిచిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా క్రైసిస్ లో పెట్టుబ‌డులు రిక‌వ‌రీ కోసం డేర్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో లులియా వాంటూర్ ఓ పాట‌ను ఆల‌పించారు. అదే స‌మ‌యంలో ప్రేమప‌క్షుల ప్ర‌ణ‌యం అంటూ స‌ల్మాన్ - లులియా జంట‌పై ప్ర‌చారం తెర‌పైకొచ్చింది.

`రాధే` షూటింగ్ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రు షికార్లు చేసిన వీడియోలు.. ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా ఈ జంట‌ ట‌ర్కీ హోట‌ల్ లో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నేరుగా హోట‌ల్ లో ఉన్న ఫోటోని లులియా స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌డంతో సందేహాలు తొల‌గిపోయాయి. మ‌రి ఈ టూర్ ఇద్ద‌రికీ ప‌ర్స‌న‌ల్ ట్రిప్ అనుకోవాలా.. లేదూ షూటింగ్ లో భాగంగానా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ `టైగ‌ర్ -3`లో న‌టిస్తున్నారు.

ఈ సినిమా విదేశీ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ర‌ష్యాలోని పీట‌ర్స్ బ‌ర్గ్ లో ఐదు రోజుల పాటు షూటింగ్ చేసారు. అనంత‌రం ట‌ర్కీలో మ‌రో షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా యూనిట్ అంతా ట‌ర్కీ వెళ్లింది. ఇస్తాంబుల్ లో కీల‌క స‌న్నివేశాలు ప్లాన్ చేసారు. ఇదే స‌మ‌యంలో లులియా వాంటూర్ భాయ్ ని విడిచిపెట్ట‌కుండా త‌న‌నే అంటిపెట్టుకుని తిర‌గ‌డం యూనిట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టైగ‌ర్ -3లో పాట‌లు పాడ‌టానికి వెళ్లిందా? లేక స‌ల్మాన్ కోసం ప‌ర్స‌న‌ల్ గార్డ్ లా విమానం ఎక్కిందా? అంటూ నెటిజ‌నులు ఆస‌క్తిక‌ర కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు. ఈ టూర్ ని వ్య‌క్తిగ‌త టూర్ గా మార్చుకోక‌పోతే ఆ ఇద్ద‌రూ హోట‌ల్ లో ఎందుకు గ‌డుపుతారు? అంటూ ఫ్యాన్స్ క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.

ట‌ర్కీ షెడ్యూల్ లో భాగంగా నాలుగు ప్ర‌దేశాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. హీరోపై ప‌రిచ‌య స‌న్నివేశాల్ని ఇస్తాంబుల్ లోని మైడెన్ ట‌వ‌ర్ లో.. యూర‌ప్ లోని ఖ‌రీదైన ల‌గ్జ‌రీ హోట‌ల్ మార్ధ‌న్ ప్యాలెస్ లో చిత్రీక‌రించారు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి కొన్ని స‌న్నివేశాలు కూడా లీక‌య్యాయి. సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ లో షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అభిమానులు భారీగా త‌ర‌లి రావ‌డం.. వారి ఫోన్ల‌లోనే ఈ ఫోటోని షూట్ చేయ‌డం కార‌ణంగా అక్క‌డి స‌న్నివేశాలు నెట్టింట జోరుగా వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

మెగాస్టార్ కి స్నేహ హ‌స్తం..!

స‌ల్మాన్ భాయ్ ఓ వైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌డం ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న లూసీఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ లో భాయ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించేందుకు అంగీక‌రించారు. చిరుతో స్నేహం కార‌ణంగా ఆయ‌న కోర‌గానే వెంట‌నే ఈ గెస్ట్ రోల్ కి అంగీక‌రించారు. మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ యాంటిమ్ లోనూ న‌టించ‌నున్నారు. ఇందులో ప్ర‌గ్య జైశ్వాల్ ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇరుగు పొరుగు భాష‌ల స్టార్ల‌ను క‌లుపుకుని న‌టించేందుకు అటు బాలీవుడ్ స్టార్లు కూడా ఇటీవ‌ల ఆస‌క్తిగా ఉన్నారు. ఇది కొత్త త‌ర‌హా మార్కెట్ల‌కు డోర్స్ ఓపెన్ చేస్తోంది. స‌ల్మాన్ మునుముందు మెగా కాంపౌండ్ హీరోల‌తో క‌లిసి పాన్ ఇండియా చిత్రాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.