Begin typing your search above and press return to search.

సల్మాన్ హీరోయిన్ కూడా కారుతో గుద్దేసింది

By:  Tupaki Desk   |   1 March 2017 6:00 AM IST
సల్మాన్ హీరోయిన్ కూడా కారుతో గుద్దేసింది
X
సల్మాన్‌ ఖాన్ హిట్ అండ్ రన్ కేస్ ఎంత పాపులర్ అనేది మనకు తెలిసిందే. స్వయంగా ధర్మాసనం సైతం పోలీసులు సల్మాన్ తాగిన గ్లాసులో ఉంది వాటరా లేకపోతే వోడ్కానా అనే విషయం కనిపెట్టలేకపోయారంటూ.. ఈ కేసును కొట్టేసింది. అయితే అప్పటికే కేసు ఎన్ని మలుపులు తిరిగి.. చివరకు అక్కడ చేరుకుందో ఇండియా అంతా మైక్రోస్కోప్ లో వీక్షించేసింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోయిన్ కూడా అదే తరహా కేసులో ఇరుక్కువోడం ఒక సర్పరైజ్. కాకపోతే ఇక్కడ ఎవ్వరూ చావలేదు కాబట్టి.. కేసు అంత పెద్దదయ్యే ఛాన్సులేదులే.

మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుందా? ఈ అమ్మడు మొన్న ముంబయ్ లో కారు నడుపుతూ నౌసీఫ్‌ అనే వ్యక్తిని గుద్దేసింది. బండి మీద వెళుతున్న అతను పక్కకు పడిపోవడంతో కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయ్. ఆ తరువాత అతగాడు ఆసుపత్రిలో చేరాక భాగ్యశ్రీ భర్త హిమాలయ్ అతగాడ్ని పరామర్శించి.. హాస్పటల్ బిల్ 25 వేలు అతనే కడతా అన్నాడట. కాని తరువాత ఫోన్ కూడా ఎత్తకపోవడంతో.. భాగ్యశ్రీ అండ్ ఆమె భర్తపై నౌసీఫ్‌ కేసు పెట్టాడు. ముందుగా ఈ కేసును రిజిష్టర్ చేయడానికి పోలీసులు సహకరించలేదట.

కట్ చేస్తే భాగ్యశ్రీ కూడా డబ్బులు చిన్న గాయానికి లక్షల్లో డబ్బులు కావాలంటూ తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నౌసీఫ్‌ పై చీటింగ్ కేసును పెట్టారు.