Begin typing your search above and press return to search.

ఔను ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నా

By:  Tupaki Desk   |   14 May 2020 11:00 AM IST
ఔను ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నా
X
ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సాహో చిత్రం బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో మరోసారి ప్రభాస్‌ మూవీని హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో హిందీ స్టార్స్‌ ను ఈ చిత్రంలో నటింపజేస్తున్నారు. అందులో భాగంగానే హిందీ నిన్నటి తరం హీరోయిన్‌ భాగ్యశ్రీని నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ప్రభాస్‌ 20 చిత్రం గురించి మీడియాలో వచ్చిన పలు పుకార్ల వల్ల భాగ్యశ్రీ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటి భాగ్యశ్రీ నటిస్తున్నట్లుగా ప్రకటించింది. ఆమె స్వయంగా ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రకటించింది. అయిదు పదుల వయసు దాటినా కూడా ఇంకా హాట్‌ గా ఉండే ఈమె ప్రభాస్‌ మూవీకి ఖచ్చితంగా అదనపు ఆకర్షణను తీసుకు వస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ షారుఖ్‌ ఖాన్‌ మైనే ప్యార్‌ కియా చిత్రంతో భాగ్యశ్రీ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈమద్య కాలంలో ఈమె జోరు కాస్త తగ్గింది అనుకుంటుండగా ఇలా మంచి ఆఫర్‌ దక్కింది.