Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' నుంచి భాగ్యశ్రీ బ్యూటిఫుల్ స్టిల్!

By:  Tupaki Desk   |   27 Nov 2021 4:21 AM GMT
రాధే శ్యామ్ నుంచి భాగ్యశ్రీ బ్యూటిఫుల్ స్టిల్!
X
ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా 'రాధేశ్యామ్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వస్తున్న భారీ రొమాంటిక్ సినిమా ఇది.

ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ .. విజువల్ ఎఫెక్ట్స్ జోడించినప్పటికీ అవన్నీ కూడా అందమైన ప్రేమకథకు ఆకర్షణలే. గత కొన్నేళ్లుగా ప్రభాస్ యాక్షన్ తో కూడిన ఎమోషన్ కు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అందువలన సహజంగానే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూవీ క్రియేషన్స్ - టి సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రేమకథా కావ్యాన్ని .. దృశ్యకావ్యంగా ఆవిష్కరించడానికి తమవంతు ప్రయత్నం చేశారు. ఫారిన్ నేపథ్యంలో ఈ ప్రేమకథను నడిపిస్తూ, విజువల్ బ్యూటీని యాడ్ చేశారు.

కథాకథనాల పరంగాను .. విజువల్స్ పరంగాను ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన లోకంలోకి తీసుకుని వెళ్లనున్నారు. తారాగణం విషయంలోను ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుంది. బాలీవుడ్ నుంచి భాగ్యశ్రీ వంటి సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నారు.

భాగ్యశ్రీ తెలుగు తెరపై కనిపించి చాలాకాలమే అయింది. ఆమె ఈ సినిమాలో ప్రభాస్ తల్లిపాత్రలో కనిపించనున్నారు. అయితే ఆమె పాత్ర తాలూకు విషయాలేవీ ఇంతవరకూ బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తనకి సంబంధించిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఫారిన్ లోని ఒక బంగ్లాలో ఆమె నటరాజస్వామి ఎదురుగా నాట్యం చేస్తూ ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఈ ఫొటో ఇంత బాగా రావడానికి కారణమైన సినిమాటోగ్రఫర్ మనోజ్ పరమహంసను ఆమె అభినందించారు. ఆ ఫొటో ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"ప్రపంచమే ఒక నాటక రంగం .. అందులో మనమంతా పాత్రధారులం .. ఎవరి పాత్రను వాళ్లు పోషించాలి" అంటూ భాగ్యశ్రీ రాసుకొచ్చారు. ఫారిన్ నేపథ్యంలో సాగే కథ .. భాగ్యశ్రీ పోషించినది ప్రభాస్ తల్లి పాత్ర. అలాంటి ఆమె ఒక నృత్య కళాకారిణిగా శాస్త్రీయ నాట్యం చేస్తూ కనిపిస్తుండటం ఈ కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

జస్టిన్ ప్రభాకరన్ సమకూర్చిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాలో, కృష్ణంరాజు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జనవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.