Begin typing your search above and press return to search.

భాగమతిలో చాలా స్పెషల్స్ ఉన్నట్టున్నాయ్

By:  Tupaki Desk   |   13 Feb 2017 5:15 AM GMT
భాగమతిలో చాలా స్పెషల్స్ ఉన్నట్టున్నాయ్
X
టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం బాహుబలి2 వర్క్ ను పూర్తి చేసి.. ఇతర ప్రాజెక్టుల షూటింగ్స్ మొదలు పెట్టేసింది. భాగమతి అనే మూవీలో టైటిల్ రోల్ చేస్తోన్న స్వీటీ.. పిల్ల జమీందార్ ఫేమ్ డైరెక్టర్ అశోక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసే పనిలోనే ఉంది అనుష్క.

భాగమతి కోసం ఓ పురాతనమైన ఇంటి సెట్ వేస్తున్నారు. దాదాపు 400 ఏళ్ల క్రితం హౌస్ అనిపించేలా ఈ సెట్ ఉండడం విశేషం. పీరియాడికల్ థీమ్ తో రూపొందుతున్న భాగమతిలో.. ఈ ఇంటి సెట్ కి చాలానే ప్రాధాన్యత ఉంటుందట. సినిమాలో ఎక్కువ భాగం ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. అందుకే ఈ సెట్ విషయంలో బోలెడంత రీసెర్చ్ చేసిన ఆర్ట్ డిపార్ట్ మెంట్.. హైద్రాబాద్ లోని ఓ స్టూడియోలో ఈ సెట్ నిర్మాణం పూర్తి చేశారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి రూపొందించిన సెట్.. యూనిట్ అందరినీ అబ్బురపరిచిందట.

సోషల్ డ్రామా కాన్సెప్ట్ తోనే భాగమతి తెరకెక్కుతున్నా.. పీరియాడికల్ థీమ్ తో కలిపి ఓ అద్భుతమైన సస్పెన్స్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క ఫోకస్ అంతా ఈమూవీపైనే పెట్టనుంది. అయితే.. సైజ్ విషయంలో మాత్రం స్వీటీపై కొన్ని విమర్శలు ఉన్నా.. కెమెరా వర్క్ తో దీన్ని కవర్ చేస్తూ.. సినిమా చేయనున్నారట.