Begin typing your search above and press return to search.

వర్మ మార్క్‌ తో నువ్వే నా భగవద్గీత..!

By:  Tupaki Desk   |   12 Sept 2018 6:40 PM IST
వర్మ మార్క్‌ తో నువ్వే నా భగవద్గీత..!
X
రామ్‌ గోపాల్‌ వర్మ ‘ఆఫీసర్‌’ చిత్రంతో ప్రేక్షకులను నిరాశ పర్చాడు. నాగార్జునతో తెరకెక్కించిన ఆ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఆకట్టుకోలేక పోయింది. ఆ చిత్రం తర్వాత వర్మ కాస్త గ్యాప్‌ తీసుకుని నిర్మించిన చిత్రం ‘భైరవ గీత’ అనే విషయం తెల్సిందే. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను మరియు ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది. కన్నడ మరియు తెలుగులో ఏక కాలంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దసరా కానుకగా ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన వర్మ తాజాగా పాటను విడుదల చేయడం జరిగింది.

నువ్వే నా భగవద్గీత అంటూ సాగే ఈ పాటను సిరాశ్రీ రాశాడు. రవిశంకర్‌ ట్యూన్‌ చేసిన ఈ పాటను విజయ్‌ ఏసుదాసు - సాక్షి హోల్కర్‌ లు పాడారు. రామ్‌ గోపాల్‌ వర్మ మార్క్‌ లో ఈ పాట సాగుతుంది. సహజంగా వర్మ చిత్రాల్లో పాటలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడు అనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం పాటల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రంను వర్మ శిష్యుడు సిద్దార్థ తెరకెక్కించిన విషయం తెల్సిందే.

కన్నడ నటుడు ధనుంజయ్‌ మరియు ఇర్రా మోర్‌ లు ఈ చిత్రంలో హీరో హీరోయిన్‌ లుగా నటించారు. వీరిద్దరి మద్య రొమాంటిక్‌ సీన్స్‌ మాస్‌ ఆడియన్స్‌ ను అలరిస్తాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రం అరవింద సమేత చిత్రంకు పోటీగా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి కలెక్షన్స్‌ను రాబడుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్మ కంపెనీ నుండి ఈమద్య వచ్చిన చిత్రాలు ఆకట్టుకోలేక పోతున్నాయి. మరి ఈ చిత్రం అయినా వర్మ కంపెనీకి సక్సెస్‌ ను తెచ్చి పెడుతుందో చూడాలి.