Begin typing your search above and press return to search.
ప్రభాస్ 'అడవిరాముడు' టైటిల్ వెనుక ఇంత కథ ఉంది: బి.గోపాల్
By: Tupaki Desk | 22 Oct 2021 9:20 AM ISTప్రభాస్ 'వర్షం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత చేసిన సినిమానే 'అడవిరాముడు'. ఎన్టీ రామారావు కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిన సినిమాల్లో 'అడవిరాముడు' ఒకటి. అప్పట్లో ముదుమలై ఫారెస్టులో 50 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా ఇది. ఆ తరువాత ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు బి. గోపాల్ అదే టైటిల్ తో 2004లో సినిమా చేశాడు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఆ సినిమాను గురించి, తాజా ఇంటర్వ్యూలో బి. గోపాల్ ప్రస్తావించారు.
"ప్రభాస్ సినిమాకి ముందుగా 'అడవి రాముడు' టైటిల్ అనుకోలేదు. ఆ టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా లేదు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగు జరుగుతోంది. అప్పుడు మా ప్రొడ్యూసర్ అడ్డాల చంటి అక్కడే ఉన్నాడు. 'ఆరేసుకోబోయి పారేసు కున్నాను' అనే పాటను ఆయన హమ్ చేస్తున్నాడు. ఆ పాట వినగానే .. "ఈ పాట మన సినిమాలో పెట్టేద్దామా" అన్నాను.
'మణిశర్మ ఒప్పుకుంటాడా' అన్నాడు. "మణిశర్మను నేను ఒప్పిస్తే ఓకేనా?" అన్నాను. 'ఆయన ఒప్పుకుంటే అంతకంటే ఏం కావాలి?' అన్నాడు. అక్కడి నుంచే మణిశర్మకు కాల్ చేసి విషయం చెప్పేసి .. రిక్వెస్ట్ చేశాను. ముందు కాస్త ఆలోచించినా ఆ తరువాత చేసేద్దాం అన్నారు.
'అడవి రాముడు' సినిమాలో ఉన్న ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అనే పాట పెట్టాము గనుక, 'అడవిరాముడు' టైటిలే పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అప్పటివరకూ ఏ టైటిలూ అనుకోలేదు. అప్పటికే మేము ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ తీసేశాము. ఫారెస్టులో ఎవరో ఆయనను పిలిస్తే ఇంట్లో నుంచి బయటికి రావడం అనే ఇంట్రడక్షన్ ను చాలా సింపుల్ గా తీశాము. 'అడవిరాముడు' టైటిల్ పెట్టిన తరువాత, ప్రభాస్ ఏనుగు మీద రావడమనేది ఇంట్రడక్షన్ సీన్ గా మార్చాము. అవన్నీ మాకు ప్లస్ అయ్యాయి.
'అడవి రాముడు' సూపర్ హిట్ అని నేను చెప్పనుగానీ, బి .. సి .. సెంటర్లలో బాగా ఆడింది. మా సినిమాలకు ముందు ఆర్తి అగర్వాల్ ఒకటి రెండు హిట్లు కొట్టేసి సక్సెస్ లో ఉంది, అందువలన ఆమెను తీసుకున్నాము. అప్పటికే ఆమె బాగా లావైపోయింది. కానీ ముందుగా కమిట్ అయిన కారణంగా అలాగే షూటింగు చేశాము. ప్రభాస్ విషయానికి వస్తే ఆయన బంగారం. నేను చూసిన ప్రభాస్ కి .. 'బాహుబలి' తరువాత ప్రభాస్ కి ఎంతో తేడా ఉంది. క్రేజ్ పరంగా ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన మొదటి రెండు సినిమాలు 'ఈశ్వర్' .. 'రాఘవేంద్ర' చూడకుండానే ఈ సినిమాకి ఆయనను అనుకున్నాను. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజుగారు నాకు బాగా తెలుసు. 'అమర దీపం' సినిమాకి నేను కో డైరెకర్ గా పని చేశాను. ఆ సమయంలో నేను నెలకి 350 రూపాయల జీతాన్ని ఆయన చేతుల మీదుగా అందుకున్నాను" అని చెప్పుకొచ్చారు.