Begin typing your search above and press return to search.

పసివాళ్లను పాపులర్ చేసిన పాప్ రాణి​

By:  Tupaki Desk   |   15 July 2017 5:14 AM GMT
పసివాళ్లను పాపులర్ చేసిన పాప్ రాణి​
X
అమెరికాలో పాప్ సింగర్ అయితే అక్కడ ఉండే క్రేజే వేరు. ఒక హాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. మైఖేల్ జాక్సన్ - బ్రిట్నీ స్పియర్స్ - మడోన్నా - రిహాన్నా ఇలా ఎవరిని తీసుకున్న అమెరికాలో వాళ్ళకి ఒక స్పెషల్ స్టార్ స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న తరానికి కూడా అలాంటి ఒక పాప్ రాణి ఉంది.. ఆమెనే ‘బియాన్సే’. ఈమె గర్భంతో ఉన్నప్పుడూ కూడా ఒక షో లో పాడి తనకున్న క్రేజ్ ని మరింత పెంచుకుంది. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది ఒకేసారి.

ఎప్పుడెప్పుడు ఆమె పిల్లలును చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుక్రవారం తన కవలలతో ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన కవలలు కార్టర్ - రూమీని తన పొదివిలో ప్రేమగా పట్టుకొని ఉన్న దేవతలాంటి ఫోటో షేర్ చేసిందీ అమ్మడు. అందరూ ఊహించినట్లే తన పసి పిల్లలును గొప్పగా పరిచయం చేసిందీ మ్యూజిక్ సూపర్ స్టార్. పువ్వులు దండల మధ్య పిల్లను ఎత్తుకొని సముద్రం అంచున నిలుచోని ఒక ఫోజ్ ఇచ్చింది ఇలా. బియాన్సే - ఆమె భర్త రాప్పర్ జై జీ కలిసి యూ‌ఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ వాళ్ళకి ఇవ్వవలిసిన డాక్యుమెంట్స్ ఇచ్చారు అంటా. కాటర్ ఫ్యామిలి బియాన్సే పిల్లలును సాదరంగా ఆహ్వానం పలికారు.

బియోంసే పిల్లలకు కావలిసిన అన్ని సుగంధం సౌందర్య సామగ్రి - బేబీ గేర్ - టోటే బాగ్స వాటర్ బాటిల్స్ కోసం కూడా డాక్యుమెంట్స్ అందించారు అని చెబుతున్నారు అమెరికా మీడియా.​