Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: భేతాళుడు బిచ్చగాడు అదిరే!!

By:  Tupaki Desk   |   20 Sep 2016 4:52 AM GMT
ట్రైలర్ టాక్: భేతాళుడు బిచ్చగాడు అదిరే!!
X
బిచ్చగాడు మూవీతో కోలీవుడ్ లో హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ.. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇన్వెస్ట్ మెంట్ పరంగా చూస్తే.. తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాల్లో బిచ్చగాడి రికార్డును బ్రేక్ చేయడం.. విజయ్ ఆంటోనీకి కూడా కష్టమే. ఈ హీరో నటిస్తున్న మరుసటి చిత్రం సైతాన్. ప్రస్తుతం ఈ హీరో తెలుగులో సంపాదించుకున్న క్రేజ్ ని బేస్ చేసుకుని.. సైతాన్ ను తమిళ్ తో పాటే తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

ఇప్పుడీ సైతాన్ తమిళ టీజర్ ని లాంఛ్ చేసింది యూనిట్. తెలుగులో బేతాళుడుగా వస్తున్న ఈ సినిమా టైటిల్ లోనే ఇదో దెయ్యాల సినిమా అనే విషయాన్ని చెప్పేసిన యూనిట్.. టీజర్ ని సూపర్బ్ గా కట్ చేశారు. సాధారణంగా దెయ్యం సినిమాల్లో.. అసలు దెయ్యం ఎవరా అనే సస్పెన్స్ రెండు మూడు కేరక్టర్ల చుట్టూ తిప్పుతూ ఉంటారు. కానీ ఈ టీజర్ లో మాత్రం.. ప్రతీ ఒక్కరూ అనునాస్పదంగా కనిపిస్తారు.. అనుమానంగానే చూస్తుంటారు. విజయ్ ఆంటోనీ సైతాన్ కు ఇదే ప్రధాన ఆకర్షణ కానుందనే విషయం అర్ధమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన గాయత్రీ మంత్రం ఛాంటింగ్.. ఈ టీజర్ లో ప్రధాన ఆకర్షణ.

అరుంధతీ నాయర్ హీరోయన్ గా నటించిన సైతాన్ ను.. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. మరోసారి మనోళ్ళకు 'బిచ్చగాడు' రేంజులో సినిమాను చూపిస్తాడా లేదా అనే విషయం తెలియాలంటే.. మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.