Begin typing your search above and press return to search.

నోట్ల దెబ్బకి బేతాళుడు బెంబేలు!!

By:  Tupaki Desk   |   14 Nov 2016 10:21 AM GMT
నోట్ల దెబ్బకి బేతాళుడు బెంబేలు!!
X
బిచ్చగాడు మూవీతో టాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఊహించలేని.. కనీసం ఆ హీరో కూడా అంచనా వేయలేనంతటి విజయం సాధించిన బిచ్చగాడు తర్వాత.. బేతాళుడు అంటూ రాబోతున్నాడీ హీరో. తమిళ్ లో సైతాన్ పేరుతో ఈ చిత్రం రూపొందగా.. తెలుగులో బేతాళుడు అనే టైటిల్ పై డబ్బింగ్ చేశారు.

ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో.. బిచ్చగాడు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడంతో.. ఇప్పటికే సినిమాపై బోలెడంత ఆసక్తి నెలకొనగా.. ఈ శుక్రవారం అంటే నవంబర్ 18న బేతాళుడు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ సంక్షోభం సినిమారంగంపై బాగా కనిపిస్తోంది. మంచి టాక్ వచ్చిన సినిమాలు కూడా వసూళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఇలాంటి సమయంలో రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్స్ విషయంలో భారీగా నష్టపోతున్నాయి. అందుకే బేతాళుడు ని కూడా పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికైతే ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదు కానీ.. ఈ శుక్రవారం రావడం లేదన్న విషయం మాత్రం తేలిపోయింది. సూపర్ ఫాంలో ఉన్న విజయ్ ఆంటోనీ.. బేతాళుడుతో మరో సక్సెస్ కొట్టేస్తాడని అనుకుంటే.. సడెన్ గా వచ్చిన కరెన్సీ సంక్షోభం.. బేతాళుడిని కూడా బెంబేలెత్తించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/