Begin typing your search above and press return to search.

`బిచ్చ‌గాడు` మ‌రో షాకిచ్చాడు!

By:  Tupaki Desk   |   22 Nov 2016 3:40 AM GMT
`బిచ్చ‌గాడు` మ‌రో షాకిచ్చాడు!
X
విడుద‌ల‌కి ముందే త‌న సినిమాలోని ప‌ది నిమిషాల స‌న్నివేశాల్ని రిలీజ్ చేసి అంద‌రికీ షాకిచ్చాడు విజ‌య్ ఆంటోనీ. సినిమాపై ఆయ‌న‌కున్న కాన్ఫిడెన్స్‌ కి నిద‌ర్శ‌నమ‌ది. మామూలుగా అయితే క‌థ ఎక్క‌డ రివీల్ అవుతోందో అనే భ‌యంతో సినిమాల్లోని ఒక‌ట్రెండు స‌న్నివేశాల్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి కూడా నిరాక‌రిస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. విజ‌య్ ఆంటోనీ మాత్రం ఆయ‌న న‌టించిన `బేతాళుడు` సినిమాలోని ప‌ది నిమిషాల స‌న్నివేశాల్ని ఇటీవ‌ల ఆన్‌ లైన్‌ లో రిలీజ్ చేశారు. ఆ విష‌యం గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిక‌రంగా మాట్లాడుతుండ‌గానే మ‌రో షాకిచ్చాడాయ‌న‌. గురువారం సినిమాని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

స‌హ‌జంగా సినిమాల్ని శుక్ర‌వారం విడుద‌ల‌వుతుంటాయి. గురువారం ఏదైనా హాలీడే వ‌చ్చిందంటేనే ఆ రోజున రిలీజ్ చేసేందుకు సాహసం చేస్తారు. అయితే విజ‌య్ ఆంటోనీ మాత్రం గురువారం సెల‌వు కాక‌పోయినా ఆ రోజున విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న సినిమాపై ప్రేక్ష‌కుల్లో క్యురియాసిటీ ఉందనే న‌మ్మ‌కంతోనే ఆ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు విజ‌య్ ఆంటోనీ. `బిచ్చ‌గాడు`తో తెలుగులో ఆయ‌న‌కి ఘ‌న విజ‌యం ల‌భించింది. రూ: 20కోట్ల‌కిపైగా వ‌సూలు చేసి ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ విజ‌యం అందించిన ఉత్సాహంతోనే విజ‌య్ ఆంటోనీ ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. మ‌రి ఆ ధైర్యానికి త‌గ్గ‌ట్టుగా రిజ‌ల్ట్ వ‌స్తుందో లేదో చూడాలి. `బేతాళుడు` తెలుగుతోపాటు, త‌మిళంలోనూ ఒకేసారి విడుద‌ల‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/