Begin typing your search above and press return to search.

‘ధృవ’ రావట్లేదు.. ఇదిగో రుజువు

By:  Tupaki Desk   |   16 Nov 2016 3:38 AM GMT
‘ధృవ’ రావట్లేదు.. ఇదిగో రుజువు
X
ఆల్రెడీ దసరా నుంచి డిసెంబరుకు వెళ్లింది రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా. ఈసారి డేట్ మిస్ కాకుండా అంతా పక్కాగానే పని పూర్తి చేశారు. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. అంతా సాఫీగా సాగిపోతున్న దశలో ఇప్పుడు పెద్ద నోట్ల వ్యవహారం పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నిర్ణయంతో ఇండస్ట్రీలో ఆర్థిక లావాదేవీలన్నింటి మీదా ప్రభావం పడింది. థియేట్రికల్ కలెక్షన్లూ దెబ్బ తినే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తర్వాతి వారాల్లో రాబోయే సినిమాలన్నింటికీ ఇబ్బంది ఎదురైంది. ఎంత ఆలస్యంగా వీలైతే అంత ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నారు నిర్మాతలు.

ఈ నేపథ్యంలోనే ‘ధృవ’ డిసెంబరు 2 నుంచి వాయిదా పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ముందు డిసెంబరు 9కి వాయిదా అన్నారు. ఆ తర్వాత జనవరి రిలీజ్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ డేట్ ఏదన్న విషయంలో క్లారిటీ లేదు కానీ.. సినిమా వాయిదా పడటం అయితే గ్యారెంటీ అని తేలిపోయింది. ‘ధృవ’ టీం నుంచి పక్కాగా సమాచారం ఉండటంతో డిసెంబరు 2న మరో క్రేజీ మూవీ విడుదలకు ముహూర్తం ఖాయం చేసింది . అదే.. బేతాళుడు. తమిళంలో ‘సైతాన్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకే రోజు విడుదల చేయబోతున్నారు. ఈ శుక్రవారం రావాల్సిన ఈ చిత్రాన్ని కరెన్సీ కష్టాల నేపథ్యంలో డిసెంబరుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ‘ధృవ’ డిసెంబరు 2న రాదన్న సమాచారం పక్కా కావడంతోనే ఆ రోజుకు బేతాళుడు రిలీజ్ డేట్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/