Begin typing your search above and press return to search.

హాలీవుడ్ సినిమాను భలే లేపేశారు గురూ

By:  Tupaki Desk   |   2 Dec 2016 4:28 AM GMT
హాలీవుడ్ సినిమాను భలే లేపేశారు గురూ
X
బాడీలోకి ఒక డ్రగ్ ఎక్కించిన వెంటనే ఒక అమ్మాయికి సైకో కైనెటిక్ ఎబిలిటీస్ వచ్చేస్తాయి. ఆ అమ్మాయి తన గత జన్మలో ఏం జరిగింది.. అలాగే ఇంకా పూర్వ జన్మల్లో ఏం జరిగిందో తెలుసుకుంటుంది. ఇక విపరీతమైన టెలీపతి వంటి పవర్లు వచ్చేస్తాయి. మెంటల్ గా టైమ్ ట్రావెల్ చేసేస్తుంది. ఆ సినిమా పేరు ''లూసీ''. 2014లో వచ్చిన ఈ సినిమా కంటెంట్ క్రిటిక్స్ కు విసుగుతెప్పించినా కూడా.. లూసీ టైటిల్ రోల్ పోషించిన స్కార్లెట్ జోహాన్సెన్ కారణంగా 10 మిలియన్ డాలర్లతో రూపొందించిన ఈ సినిమాకు 430 మిలియన్ల కలక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడింతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనేగా.. పదండి చూద్దాం.

నిన్న రిలీజైన ''భేతాళుడు'' సినిమాను చూసుకుంటే.. ఖచ్చితంగా అందులోని సెంట్రల్ ప్లాట్ కు ఈ సినిమా లవర్స్ అందరూ కెవ్వు కేక అంటారు. కాకపోతే అక్కడ హీరో కేవలం ఒకే ఒక్క జన్మ వెనక్కి వెళతాడు. ఆ జన్మలో జరిగిన దానికి ఈ జన్మలో రివెంజ్ తీర్చుకోవడమే కథాంశం. లూసీ సినిమాలో మాత్రం జన్మ జన్మల వెనక్కి వెళిపోయి ఆ హీరోయిన్ ఒక సూపర్ కంప్యూటర్ గా మారిపోయి.. చివరకు ఒక ఆత్మ టైపులో అనంత విశ్వంలో కలసిపోతుంది. కాస్త 'లూసీ' సినిమాను తీసుకుని ఇండియనైజ్ చేసి మన సీన్లూ సెటైర్లు జోడిస్తే.. అదే భేతాళుడు అవుతుంది మరి. అందుకే ఇప్పుడు అందరూ లూసీ సినిమాను భలే లేపేశారు గురూ అంటూ డిస్కషన్లు చేస్తున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/