Begin typing your search above and press return to search.

2015 బెస్ట్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:40 AM GMT
2015 బెస్ట్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి
X
2015 చివరకు వచ్చేస్తోంది. ఏడాడికి ముగింపు అనగానే.. ఏది బెస్ట్ అనే అంచనాలు, ఫలితాలు వస్తుంటాయి. అలాగే ఇప్పుడు యాపిల్ ఐట్యూన్స్ టాలీవుడ్ బెస్ట్ మూవీని ప్రకటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని ఈ ఏడాది బెస్ట్ ఆల్బంగా ప్రకటించింది ఐ ట్యూన్స్. ప్రతీ ఏడాది బాగా పాపులర్ అయిన మూవీస్ ని ఇలా లిస్ట్ చేయడం యాపిల్ కి అలవాటే.

అయితే.. ఇది సేల్స్ పరంగా రూపొందించే జాబితా కాదు. ఆడియో క్వాలిటీ, దానికి లభించిన ఆదరణ, యూజర్ల నుంచి వచ్చిన రివ్యూస్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. ఇందులో ఎక్కువమంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సన్నాఫ్ సత్యమూర్తికే మొగ్గు చూపారు. నిజానికి ఈ మూవీకి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. సినిమాలో పెద్దగా సరుకేం లేదని, త్రివిక్రమ్ పెన్ను పదును తగ్గిందని అన్నారు. అయితే.. థియేటర్లలో మాత్రం సత్యమూర్తి బాగానే ఆడింది. కలెక్షన్లు కూడా 50 కోట్లకు పైగా వచ్చాయి. దీంతో 2015 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచాడు సత్యమూర్తి. ముఖ్యంగా ఆడియో పరంగా మంచి మార్కులే పడ్డాయి.

బాహుబలి - శ్రీమంతుడు లాంటి చిత్రాలు పోటీ ఉన్నా.. ఆడియో ఆల్బం పరంగా సత్యమూర్తికే జనాలు మొగ్గు చూపారంటే.. అందుకు డీఎస్పీని అభినందించాల్సిందే. ఈ విజయంలో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ లకు కూడా భాగం ఉందని చెప్పేందుకు సందేహించాల్సిన అవసరం లేదు.