Begin typing your search above and press return to search.

బెస్ట్ డ్యాన్స్ కాంబో.. అసలైన డ్యాన్స్ వార్

By:  Tupaki Desk   |   7 April 2023 2:57 PM IST
బెస్ట్ డ్యాన్స్ కాంబో.. అసలైన డ్యాన్స్ వార్
X
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 మూవీ ఫిక్స్ అయిన సంగతి విదితమే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే విషయం పై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. అయాన్ ముఖర్జీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర 2, 3 పార్ట్స్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఇక సినిమాలలో ఒకటి 2026లో రిలీజ్ కాగా లాస్ట్ పార్ట్ 2027లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ రెండు రిలీజ్ తర్వాత వార్ 2 మూవీ తెరకెక్కుతుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే తారక్, హృతిక్ కాంబినేషన్ లో సినిమా అనేసరికి ఒక్కసారి గా ఇండియన్ వైడ్ గా బజ్ క్రియేట్ అయ్యింది. సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ స్టార్ గా ఉన్నాడు.

ఇక హృతిక్ రోషన్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఆర్ఆర్ఆర్ లో తారక్ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో వార్ 2లో హృతిక్ రోషన్, తారక్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ని ప్రేక్షకులు ఆశిస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ ఇద్దరి హీరోల నుంచి ఫ్యాన్స్ కోరుకునే మరో ఎలిమెంట్ డాన్స్.

ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ లో ఒకడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నెంబర్ డాన్సర్ గా ఉన్నాడు. అతని డాన్స్ గ్రేస్, స్టైల్ కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే సాంగ్ లో డాన్స్ చేస్తే ఇక థియేటర్స్ లో ప్రేక్షకులు నెక్స్ట్ లెవల్ లో ఎంజాయ్ చేస్తారని అంచనా వేస్తున్నారు.

అలాగే ఈ ఇద్దరు డాన్స్ లో పోటీ పడుతూ ఉంటే చూడటానికి కూడా నిండుగా ఉంటుంది. మరి అయాన్ ముఖర్జీ కేవలం యాక్షన్ సీక్వెన్స్ మీద మాత్రమే కాకుండా వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కాంబినేషన్ పైన కూడా దృష్టి పెడతాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.