Begin typing your search above and press return to search.

ఆ తిట్టే తండ్రికి బెస్ట్ కాంప్లిమెంట్ అంట

By:  Tupaki Desk   |   23 July 2015 8:26 AM GMT
ఆ తిట్టే తండ్రికి బెస్ట్ కాంప్లిమెంట్ అంట
X
బాహుబలి సినిమాను పొగిడేసే వారెందరో. ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ కు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటని ప్రశ్నిస్తే.. ఒక భారీ తిట్టే తనకు దక్కిన మర్చిపోలేని కాంప్లిమెంట్ గా చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.

బాహుబలి సినిమాకు కథ అందించిన ఆయన.. ఆ చిత్రం బ్రహ్మాండంగా సక్సెస్ కావటానికి కారణం దర్శకుడు రాజమౌళినే అంటూ క్రెడిట్ ఇచ్చేసిన ఆయన.. తాను విన్నంతవరకూ తాను మర్చిపోలేని ఒక తిట్టే.. బాహుబలికి దక్కిన కాంప్లిమెంట్ గా చెబుతున్నారు. తిట్టు అంటున్నారు..? మళ్లీ మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటున్నారన్న కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇస్తూ.. అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

గోదావరి పుష్కరాల్లో భాగంగా ఇటీవల పుష్కర స్నానం చేయటానికి కొవ్వూరుకు వెళ్లారట. అక్కడ స్నానం చేసే సమయంలో.. బాహుబలి గురించి ఒక కుటుంబం మాట్లాడుకుంటూ.. తిట్టిపోశారంట. ఇంతకీ వారి తిట్లు అన్నీ.. సినిమాను మధ్యలో ముగించి..సస్పెన్స్ మిగిల్చారని.. రెండో పార్ట్ చూసేందుకు మళ్లీ ఏడాది ఆగటాన్ని వారు జీర్ణించుకోలేకపోవట వారి మాటల్లో వినిపించిందట. వారు తిట్టిన తిట్లలో.. బాహుబలిని వారెంత అభిమానిస్తున్నారో అర్థమవుతుందని.. అందుకే.. ఆ తిట్లే తాను మర్చిపోలేని కాంప్లిమెంట్స్ అని చెప్పుకొచ్చారు.