Begin typing your search above and press return to search.

భారీ స్కెచ్చుటో చిట్టి రోబో!

By:  Tupaki Desk   |   28 Nov 2018 11:30 AM GMT
భారీ స్కెచ్చుటో చిట్టి రోబో!
X
మరో పన్నెండు గంటల్లో తెరమీదకు రాబోతున్న 2.0 మీద అంచనాలు అంతకంత పెరిగిపోతున్నాయి. తలైవా ఇమేజ్ సహజమే కానీ దానికి శంకర్ బ్రాండ్ ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్ తోడవ్వడంతో హైప్ బాగానే ఉంది. ఎన్నడూ లేనిది తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ సినిమా ఇంత భారీ ఎత్తున విడుదల కావడం పట్ల దీని కొనుగోలుతో సంబంధం లేని ఇతర బయ్యర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పట్టణాల్లో సైతం తెల్లవారుఝామున 5 గంటలు మొదలుకుని రాత్రి 11 దాకా వరసబెట్టి షోలను ప్లాన్ చేయటమే దీనికి కారణం. రోజుకు రెండు ఆటలు అదనంగా వేసుకునే వెసులుబాటుతో పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక అనుమతులు తోడవ్వడంతో 2.0 ఓపెనింగ్ లో భారీ ఫిగర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

పరిస్థితి చూస్తుంటే వీలైనంత మొత్తం మొదటి రోజే రాబట్టాలనే ఎత్తుగడ తప్ప టాక్ బాగుంటే మిగిలిన రోజుల్లో మంచి పికప్ తో రికార్డ్స్ కొట్టవచ్చు అనే ధ్యాస కనిపించడం లేదని అఫ్ ది రికార్డు ఓ డిస్ట్రిబ్యూటర్ కామెంట్ చేయడం గమనార్హం. ఇక్కడ ఫస్ట్ డే ఓపెనింగ్ నే 2.0 నిర్మాతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. బాగుంది అనే టాక్ వస్తే రిలాక్స్ అవ్వొచ్చు లేదా ఏదైనా తేడా కొట్టిందా అంటే మొదటిరోజు ఓపెనింగ్ రూపంలో రికవరీ శాతాన్ని పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇలా బెనిఫ్ట్ షోలకు తెరతీసినట్టు సమాచారం. గత కొన్నేళ్లలో గమనిస్తే నగరాల్లో తప్ప కాలా-కబాలి లాంటి వాటికి పట్టణాల్లో బిసి సెంటర్స్ లో ఫ్యాన్స్ షోలు వేయలేదు. కానీ 2.0 విషయంలో మాత్రం దానికి భిన్నంగా వెళ్తున్నారు.

ఎలాగూ దొరుకుతున్నాయి కదా అని మొదటి రోజు ఆన్ లైన్ లో బుక్ చేసుంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ దొరకని వాళ్ళు కూడా వీక్ ఎండ్ లో దొరుకుతాయో లేదో అన్న ఉద్దేశంతో ఓసారి చూసేద్దాంలే అని మిగిలిన రోజులకు బుకింగ్ చేసుకుంటున్నారు. కర్నూలు లాంటి చిన్న స్థాయి నగరంలో 15 స్క్రీన్లలో వందకు పైగా షోలను కేవలం మొదటి రోజే ప్లాన్ చేసారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి దాదాపు అలాంటి చిన్న నగరాలు అన్నింటిలో ఉంది. ఫస్ట్ డే టార్గెట్ తెలుగు రాష్ట్రాల నుంచి 15 నుంచి 20 కోట్ల దాకా నిర్మాతలు ఆశిస్తున్నట్టు సమాచారం. వీకెండ్ అయ్యే లోపు 40 దగ్గరకు వెళ్లాలని చూస్తున్నారట. ఎంత హంగామా చేసినా ఫైనల్ గా సినిమాను నిలబెట్టేది కంటెంటే. అది ఉంటె నలభై ఏం ఖర్మ యాభై కోట్లయినా కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. మరి 2.0 చిట్టి ఏం చేయబోతున్నాడో ఎంత తీసుకురాబోతున్నాడో ఇంకొద్ది గంటల్లో తేలిపోతుంది