Begin typing your search above and press return to search.

మహానటికి అలా కలిసొచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   28 May 2018 12:29 PM IST
మహానటికి అలా కలిసొచ్చేస్తోంది
X
విడుదలకు కొన్ని వారాలకు ముందు వరకు మహానట చిత్రానికి విపరీతమైన హైప్ ఏమీ లేదు. పైగా అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య విడుదల అయిన 5 రోజులకే షెడ్యూల్ చేయడంతో.. అసలు థియేటర్లు దొరుకుతాయా అని అనుకున్నారంతా. కానీ మొదటి రోజు మొదటి షో పడ్డప్పటి నుంచి లెక్కలు మారిపోయాయి.

మహానటి మూవీకి విపరీతమైన డిమాండ్. వీకెండ్ కల్లా పెద్ద సినిమాలను తీసేసి.. ఈ చిత్రానికి స్క్రీన్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. మహానటి బాగా ఆడుతుండడంతో.. ఆ తర్వాతి వారంలో సినిమా రిలీజ్ లకు ఎవరూ డేర్ చేయలేదు. పైగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ షెడ్యూల్ చేసి లేదు. కానీ గత వారాంతం మాత్రం ఆసక్తి కలిగించింది. మాస్ మహరాజ్ మూవీ నేల టిక్కెట్టు.. ఫ్యామిలీ మూవీ అమ్మమ్మగారిల్లు రిలీజ్ కావడంతో.. మహానటి స్పీడ్ కి బ్రేకులు తప్పవని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఇది కూడా అంతా ఒట్టిదే అని తేలిపోయింది.

రవితేజ మూవీ డిజాస్టర్ అని తొలి ఆటకే తేలిపోగా.. అమ్మమ్మగారిల్లు చిత్రంలో ఓవర్ డోస్ సెంటిమెంట్ అంతగా ఎక్కలేదు. దీంతో సరైన ఓపెనింగ్స్ కూడా లేవు. ఈ దెబ్బకి మళ్లీ అందరికీ మహానటి మాత్రమే ఆప్షన్ అయింది. సమ్మర్ లో మరింతగా వసూళ్లను పొందేందుకు అవకాశం చిక్కింది. ఓ రకంగా చూస్తే.. మే నెల మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా మహానటి పట్టేసింది. ఇంత సోలోగా ఇంత సమయం వసూళ్లు పొందే అవకాశం.. సమ్మర్ సినిమాల్లో మహానటికి మాత్రమే దక్కింది.