Begin typing your search above and press return to search.

హిట్ ఫార్మాట్ అది కాదేమో 'అల్లుడూ'

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:07 AM GMT
హిట్ ఫార్మాట్ అది కాదేమో అల్లుడూ
X
అల్లుడు శీను అంటూ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. సినీ రంగంలో అల్లుళ్లకి బాగా డిమాండ్ ఉంటుందని.. పైగా ఇప్పటివరకూ బాగా క్లిక్ అయిన ఫార్మాట్ కావడంతో.. తెలిసిన జోనర్ నే నమ్ముకుని ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఎంత బడా నిర్మాత కొడుకు అయితే మాత్రం క్రేజ్ ఉంటుందా? అప్పటికే ఫ్యాన్స్ ఏర్పడిపోయి అరంగేట్రం ఎదురుచూస్తూ ఉంటారా? అంత సీన్ లేదని బాగానే తెలుసు. అందుకే మాంచి మాస్ మసాలా ఎంటర్టెయినర్.. ఓ పెద్ద డైరెక్టర్.. టాప్ రేంజ్ హీరోయిన్.. బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ తో ఐటెంసాంగ్. అందరికీ భారీ మొత్తాలు ఇచ్చేసి మరీ పట్టుకొచ్చేశారు. ఈ కాంబినేషన్ తో తను పాస్ అయిపోదామని చేసిన అల్లుడు శీను.. చివరకు నష్టాలనే మిగిల్చింది.

ఆ తర్వాత కూడా సేమ్ స్కెచ్. మరోసారి నమ్మదగ్గ డైరెక్టర్ - అప్పటికే ప్రూవ్ అయిన ఓ తమిళ్ స్టోరీ - మళ్లీ అదే మిల్కీతో ఐటెం సాంగ్... సినిమా పేరు మారింది కానీ రిజల్ట్ మాత్రం అదే. రెండు సార్లు ఇలాంటి ఫలితం వచ్చాక.. ఎవరైనా సరే తప్పేంటో ఆలోచించుకుంటారు. కానీ బెల్లంకొండ చేస్తున్న థర్డ్ ఎటెంప్ట్ కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు బోయపాటి శ్రీను డైరెక్షన్.. అందుకు తగ్గట్లుగానే భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేసేశారు.

ఈసారి కూడా టాప్ రేంజ్ హీరోయిన్ నే పట్టుకొచ్చే ప్లాన్ ఉంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కి భారీ ఆఫర్ ఇచ్చినా.. అటు నుంచి ఇంకా సిగ్నల్ రాలేదట. రాదని తేలిపోయిందని కూడా అంటున్నారు లెండి. అయినా.. రెండు సార్లు ఫెయిల్ అయిన ఫార్మాట్ తోనే మళ్లీ హిట్ కొట్టాలని ట్రై చేస్తే ఉపయోగం ఏంటో అర్ధంకాని విషయం. చుట్టూ అందరినీ గొప్పోళ్లని పెట్టుకుని హిట్ కొట్టాలనే ప్రయత్నం కరెక్ట్ కాదేమో కదా. అయినా.. ఒకవేళ అలా సక్సెస్ సాధించినా., క్రెడిట్ వాళ్లకి పోతుంది కానీ.. నీకెందుకు వస్తుంది అల్లుడు శీనూ!