Begin typing your search above and press return to search.

నాన్ థియేట్రిక‌ల్ సెక్ష‌న్ లో అదరగొడుతున్నాడు కానీ..!

By:  Tupaki Desk   |   4 Jan 2021 8:00 PM IST
నాన్ థియేట్రిక‌ల్ సెక్ష‌న్ లో అదరగొడుతున్నాడు కానీ..!
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో బెల్లంకొండ ఉత్తరాది ప్రేక్షకుల్లో కూడా స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. బెల్లంకొండ నటించిన 'అల్లుడు శ్రీను' 'స్పీడున్నోడు' 'సీత' 'జయ జానకీ నాయక' 'కవచం' 'సాక్ష్యం' వంటి చిత్రాలు హిందీలో డబ్‌ కాబడి యూట్యూబ్‌ లో మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. దీంతో శ్రీను హిందీ మార్కెట్ బాగా పెరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలో 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఈ నేపథ్యంలో బెల్లంకొండ నాన్ థియేట్రికల్ రైట్స్ ఓ రేంజ్ లో అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది.


క‌రోనా టైమ్ లో బాగా లాభ‌ప‌డిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ దాదాపు 12 కోట్ల‌కి పైనే అమ్ముడ‌వుతున్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ నటిస్తోన్న 'అల్లుడు అదుర్స్' సినిమా రైట్స్ కూడా ఇంతే రేంజ్ లో వెళ్లిన‌ట్లుగా సమాచారం. అయితే నాన్ థియేట్రిక‌ల్ సెక్ష‌న్ లో అద‌ర‌గొడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగులో మాత్రం ఫుల్ ఓపెనింగ్స్ తెచ్చుకునేంత స్టార్ హీరో కాలేకపోతున్నాడు. 'అల్లుడు అదుర్స్' సినిమాతో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకొని ఆ లోటుని పూరించుకుంటాడేమో చూడాలి. నభా నటేష్ - అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.