Begin typing your search above and press return to search.
రిలీజ్ కు సినిమా సిద్ధం.. మంచు తుఫానులో చిక్కుకుపోయిన హీరో
By: Tupaki Desk | 8 Jan 2021 9:11 AM ISTచిన్నా.. పెద్దా తేడా లేకుండా హీరో ఎవరైనా కావొచ్చు. తాను నటించిన సినిమా విడుదల అవుతుందంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. మొదటి ఆటకు వచ్చే ఫీడ్ బ్యాక్.. కలెక్షన్లు.. రివ్యూలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాలు వరుస పెట్టి ఉంటాయి. వీటిని గుర్తిస్తూ.. తాను కష్టపడిన సినిమా ఫలితం ఏమిటన్న విషయం మీద తెగ థింక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుకు భిన్నంగా ముంచు తుపానులో చిక్కుకుపోయి.. ఎప్పుడు తిరిగి వస్తారన్న విషయం మీద క్లారిటీ లేని సిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు బెల్లంకొండ శ్రీనివాస్.
తాజాగా ఆయన నటిస్తున్న అల్లుడు అదుర్సు సినిమాలోని చివరి పాట షూటింగ్ కోసం వారు కశ్మీర్ కు వెళ్లారు. షూట్ ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో కశ్మీరులో మంచుతుపాను చెలరేగిపోవటం.. దానిలో చిక్కుకపోవటంతో రాకపోకలన్ని నిలిచిపోయాయి. దీంతో.. విమాన సర్వీసులు సస్పెండ్ కావటంతో.. వారెప్పుడు తిరిగి వస్తారో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ఈ రోజు (శుక్రవారం) పెట్టుకున్నారు.
కశ్మీర్ లోని వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్ని పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో.. బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు.. మిగిలిన చిత్ర బృందం ఇరుక్కుపోయారు. మంచు కారణంగా విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయన్నది చెప్పలేకపోతున్నారు. దీంతో.. బెల్లంకొండ సురేశ్ ను.. ఎప్పటికి హైదరాబాద్ కు తీసుకొస్తారన్న దానిపై ఒక మాట అనుకున్నది లేదంటున్నారు.
ప్రీరిలీజ్ ఫంక్షన్ ను హీరో వస్తారా? రారా? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. వాతావరణ పరిస్థితుల్ని చూస్తుంటే.. రాకపోవటానికి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అలాంటిదే జరిగితే.. ప్రిరిలీజ్ ఫంక్షన్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను ఈ నెల 15న సంక్రాంతి సెలవుల్లో భాగంగా విడుదల చేయనున్నారు. షూట్ కోసం వెళ్లి ఇరుక్కుపోయిన హీరో ఉదంతం ఇప్పుడు అందరి నోట నానటమే కాదు.. వైరల్ గా మారుతోంది.