Begin typing your search above and press return to search.

బెల్లంకొండ హీరో సినిమాకు డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   1 July 2019 10:10 PM IST
బెల్లంకొండ హీరో సినిమాకు డేట్ ఫిక్స్
X
రమేష్ వర్మ దర్శకత్వంలో యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'రాక్షసుడు'. తమిళ సూపర్ హిట్ చిత్రం 'రాట్ససన్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం నిర్మాతలకు ఇబ్బంది తప్పడం లేదు. మొదట ఈ సినిమాను జులై 19 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. సోలోగా డేట్ దొరికిందని హ్యాపీగా ఉంటే డబల్ దిమాక్ రామ్ వచ్చి 'రాక్షసుడు' పై పడ్డాడు!

రామ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ జులై 12. అయితే అనుకోని విధంగా వారు రిలీజ్ డేట్ ను ఒక వారం వాయిదా వేసి జులై 19 కి డేట్ ఫిక్స్ చేశారు. దీంతో 'రాక్షసుడు' టీమ్ కు సోలో రిలీజ్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో 'రాక్షసుడు' చిత్రాన్ని ఆగష్టు 2 వ తేదీకి వాయిదా వేస్తూ కొత్త డేట్ ప్రకటించారు. అయితే ఇదే తేదీన శర్వానంద్ 'రణరంగం' విడుదల అవుతోంది. ఈ లెక్కన బెల్లంకొండ హీరో సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికినట్టు కాదు. పైగా 'రణరంగం' సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

మరి ఆ డేట్ ను ఎందుకు ఫిక్స్ చేసినట్టు? 'ఇస్మార్ట్ శంకర్'.. 'రణరంగం'.. 'రాక్షసుడు'.. ఈ మూడు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అని సమాచారం. దీంతో 'రాక్షసుడు' రిలీజ్ డేట్స్ విషయంలో ఆయన సలహాలు సూచనలు తీసుకొనే డేట్ ఫిక్స్ చేసి ఉంటారని.. 'రణరంగం' డేట్ మారే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా అయితే 'రాక్షసుడు' కు సోలో డేట్ దక్కినట్టే.