Begin typing your search above and press return to search.

రిలీజ్ ముందే 10కోట్లు ప్రాఫిట్‌ నిజ‌మా

By:  Tupaki Desk   |   5 Dec 2018 7:16 AM GMT
రిలీజ్ ముందే 10కోట్లు ప్రాఫిట్‌ నిజ‌మా
X
కాస్ట్ ఫెయిల్యూర్ అనేది పెద్ద స‌మ‌స్య‌. సినిమాని బ‌డ్జెట్ అదుపు త‌ప్ప‌కుండా తీయ‌డం, హీరో మార్కెట్‌కి అనుగుణంగా పెట్టుబ‌డులు పెట్ట‌డం ఎంతో ఇంపార్టెంట్. కానీ కొంద‌రు హీరోల విష‌యంలో అదుపు త‌ప్పి పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా నిర్మాత‌లు తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కోవ‌డం చూస్తున్నాం. కాస్ట్ ఫెయిల్యూర్ విష‌యంలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ని ప్ర‌శ్నిస్తే ఈసారి మాత్రం అలా కాలేద‌ని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు.

ప్ర‌తిసారీ ఆ మాట అన్నారు. ఈసారి మాత్రం లాభాల్లో ఉన్నాం. రిలీజ్ ముందే ప‌ది కోట్లు ప్రాఫిట్ వ‌చ్చింది. శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ రూపంలో `క‌వ‌చం` చిత్రానికి 15కోట్లు వ‌చ్చింద‌ని అన్నాడు. మునుప‌టి సినిమాలతో పోలిస్తే ఈసారి ఎంతో జాగ్ర‌త్త తీసుకుని ప‌ని చేశామ‌ని బ‌డ్జెట్ ప‌రంగా త‌ప్పు చేయ‌లేద‌ని బెల్లంకొండ అంగీక‌రించాడు.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా శ్రీ‌నివాస్ మామిళ్ల‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `క‌వ‌చం` ఈనెల 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. దాదాపు 30కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన `క‌వ‌చం` రిలీజ్ ముందే ప్రాఫిట్స్ అన్న ధీమాతో ఉంది టీమ్. సాయి శ్రీ‌నివాస్‌లో మునుపెన్న‌డూ లేనంత‌గా హిట్ కొడ‌తామ‌న్న ధీమా క‌నిపిస్తోంది. ఇక జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఇప్ప‌టికే మూడు నాలుగు స్క్రిప్టుల్ని లాక్ చేశాన‌ని బెల్లంకొండ తెలిపాడు. వాటి వివ‌రాల్ని తొంద‌ర్లోనే వెల్ల‌డిస్తాన‌ని అన్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా ఒక పాట‌- 10రోజుల పాటు చిత్రీక‌ర‌ణ మిన‌హా పూర్త‌యింద‌ని వెల్ల‌డించాడు. రిలీజ్ ముందే ప్రాఫిట్ అంటున్నాడు. ఇది నిజ‌మే అయితే మంచిదే. ఈసారి కాస్ట్ ఫెయిల్యూర్ లేద‌నేశాడు కాబ‌ట్టి, క్లారిటీతోనే ఉన్నాడు శీనూ!!