Begin typing your search above and press return to search.

చత్రపతి' నిలిచి పోయిందన్న వార్తలపై క్లారిటీ

By:  Tupaki Desk   |   13 March 2021 4:32 AM GMT
చత్రపతి నిలిచి పోయిందన్న వార్తలపై క్లారిటీ
X
టాలీవుడ్ లో అల్లుడు శీను సినిమాతో పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సక్సెస్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌ లో ఏడాదికి కనీసం ఒక్కటి అన్నట్లుగా రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవలే ఈయన అల్లుడు అదుర్స్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. మరో వైపు టాలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ చత్రపతిని బాలీవుడ్‌ లో బెల్లంకొండ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల ప్రకటించారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా నిరాశ పర్చడంతో పాటు బాలీవుడ్‌ లో చత్రపతి రీమేక్ అంటే ఎక్కువ శాతం మంది పెదవి విరుస్తున్నారు. కనుక రీమేక్‌ ఆలోచనను మానుకున్నారు అంటూ మీడియా సర్కిల్స్‌ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుకార్లకు చెక్‌ పెట్టాడు. చత్రపతి రీమేక్‌ పక్కకు పెట్టలేదని ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ముంబయికి చేరిన బెల్లంకొండ చత్రపతి పాత్ర కోసం సిద్దం అవుతున్నాడు. వినాయక్ సైతం స్క్రిప్ట్‌ వర్క్‌ లో ఉన్నాడట. అతి త్వరలోనే హిందీ చత్రపతి పట్టాలెక్కబోతున్నట్లు యూనిట్‌ వర్గాల వారు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నామన్నారు.