Begin typing your search above and press return to search.
పవన్ డైరెక్టర్ కు ఫైనల్ గా హీరో దొరికాడు!
By: Tupaki Desk | 27 Jan 2023 12:30 PM ISTరీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మూవీ `భీమ్లానాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయడం, దానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చడం తెలిసిందే. రానా కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫిగర్లని నమోదు చేసింది.
ఈ మూవీకి శ్రీవిష్ణు, నారా రోహిత్ లతో `అప్పట్లో ఒకడుండేవాడు` చిత్రాన్ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా మరో హీరో ఈ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే కామెంట్ లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సాగర్ చంద్రకు హీరో దొరికాడని తెలిసింది. తనే బెల్లంకొండ శ్రీనివాస్. `అల్లుడు శీను` మూవీ నుంచి ఇండస్ట్రీలో తెగ వైరల్ అయిన ఈ పేరు గత కొన్ని నెలలుగా వినిపించడం లేదు.
కారణం తను నటించిన `అల్లుడు అదుర్స్` ఫ్లాప్ కావడంతో పాటు `ఛత్రపతి` హిందీ రీమేక్. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ ని వి.వి.వినాయక్ ఏక ధాటిగా చేస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ నిర్మిస్తుండటంతో సినిమా నెలలుగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఎప్పటికీ పూర్తవుతుందో వినాయక్ కు అయినా తెలుసా అనే కామెంట్ లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీ కారణంగా గత కొన్ని నెలలుగా బెల్లంకొండ శ్రీనివాస్ లైమ్ లైట్ లో కనిపించడం లేదు. అతని గురించి టాలీవుడ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా వుంటే బెల్లంకొండ శ్రీనివాస్ ఫైనల్ గా `ఛత్రపతి` అండర్ ప్రొడక్షన్ లో వుండగానే `భీమ్లానాయక్` డైరెక్టర్ సాగర్ చంద్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఈ మూవీని 14 ప్లస్ రీల్స్ వారు నిర్మించబోతున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా 14 ప్లస్ రీల్స్ వారి చేతికి రావడం ఆశ్చర్యమేనని ఇన్ సైడ్ టాక్.
ఈ మూవీ స్టోరీ ఏంటీ?.. పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారా?.. ఎప్పుడు అనౌన్స్ మెంట్ వుంటుంది అన్నది త్వరలోనే బయటికిరానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో అయినా బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ చంద్ర లైమ్ లైట్ లో నిలుస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.