Begin typing your search above and press return to search.

ప్రీ లుక్: షాకింగ్ గా బెల్లకొండ రాక్షసుడు

By:  Tupaki Desk   |   5 April 2019 11:20 AM GMT
ప్రీ లుక్: షాకింగ్ గా బెల్లకొండ రాక్షసుడు
X
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ సినిమా 'రాట్చసన్' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 60% పైగా పూర్తయిందట. ఈమధ్యనే ఈ సినిమాకు 'రాక్షసుడు' అనే టైటిల్ ను లాక్ చేశారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఉగాది కంటే ముందుగా టైటిల్ లోగోతో కూడిన ప్రీలుక్ రిలీజ్ చేశారు. టైటిల్ 'రాక్షసుడు' కాగా ట్యాగ్ లైన్ 'హోల్డ్ యువర్ బ్రెత్'. ఈ పోస్టర్ లో 'ఫస్ట్ లుక్ రేపు విడుదల' అంటూ తెలిపారు. ఇక ప్రీ లుక్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే.. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ తల మాత్రం జుట్టుతో వేలాడతీసి ఉంది. కళ్ళు పీకేసి.. మొహం మీద చాలా కత్తిగాట్లతో భయంకరంగా ఉంది. నేపథ్యంలో గోడపై మర్డర్ కేసులకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్.. ఏవో నోట్స్ ఉన్నాయి. టైటిల్ లోగో కింద మాత్రం ఓపెన్ చేయని కొత్త గిఫ్ట్ ఉంది. ఈ సెటప్ అంతా చూస్తుంటే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది.

ఇప్పటివరకూ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల పోస్టర్లు ఒక ఎత్తు.. ఇది మరో ఎత్తు. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చేస్తూ ఉండే బెల్లంకొండబాబు నుండి ఇలాంటి సినిమాను అసలు ఎవరూ ఊహించరు. మొత్తానికి బాబు అందరికీ షాక్ ఇచ్చినట్టే. ఇక ఉగాది నాడు రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.