Begin typing your search above and press return to search.

ఈ యువహీరో 3 సినిమాలకు 35కోట్లు తీసుకోనున్నాడా..??

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:52 PM GMT
ఈ యువహీరో 3 సినిమాలకు 35కోట్లు తీసుకోనున్నాడా..??
X
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ నటన పరంగా మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ సినిమా సినిమాకి తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగు పరుచుకుంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ యువ హీరో రాక్షసుడు హిట్ తర్వాత ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతి రిలీజ్ కి రెడీ చేసాడు. అయితే ఈ బెల్లంకొండ హీరోకి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను మంచిపేరుంది. శీను నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అవుతుంటాయి. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు శ్రీనివాస్ సుపరిచితుడే. ఈ నేపథ్యంలో ఓ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ఛత్రపతి హిందీ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు.

డార్లింగ్ ప్రభాస్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. అయితే వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్ పై జయంతిలాల్ గడా నిర్మించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. బెల్లంకొండ శీను ఇదే ప్రొడక్షన్ హౌస్ తో మూడు సినిమాలకు సంతకం చేసాడట. అందులో ఒకటి ఈ ఛత్రపతి అని తెలుస్తుంది. ఇక ఈ మూడు సినిమాలకు కలిపి శ్రీనివాస్ ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ కోసం హీరోయిన్ ను వెతుకుతున్నారట. ఇక కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లలో ఎవరో ఒకరిని మేకర్స్ ఫైనల్ చేస్తారని వినికిడి. అధికారిక ప్రకటన రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.