Begin typing your search above and press return to search.

ఆడియన్స్ నన్ను కాకున్నా.. నా తమ్మున్ని చూస్తారు : బెల్లంకొండ శ్రీనివాస్

By:  Tupaki Desk   |   5 Jan 2021 12:17 PM IST
ఆడియన్స్ నన్ను కాకున్నా.. నా తమ్మున్ని చూస్తారు : బెల్లంకొండ శ్రీనివాస్
X
భారీ బడ్జెట్ మూవీతో వెండితెరకు పరిచయమైన నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. కమర్షియల్ హీరోగా కుమారుడిని నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.. ఒక విధంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. భారీ హిట్లు లేకపోయినప్పటికీ.. తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు తన రెండో వారసుడు గణేష్ ఎంట్రీకోసం ట్రై చేస్తున్నాడు బెల్లంకొండ.

బ్యాక్ గ్రౌండ్ లో..
నిర్మాతగా బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. కొడుకు తొలి సినిమాను గ్రాండ్ లాంఛ్ చేసిన బెల్లంకొండ.. ఆ తర్వాత శ్రీనివాస్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ లో ఉంటున్నట్లు సమాచారం. కొత్త సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయడం లేదు. ఇప్పుడు చిన్న కుమారుడిని కూడా భారీ హైప్ మధ్య ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు.

కొబ్బరికాయ కొట్టారు కానీ..
అయితే.. పవన్ సాధినేని అనే యువ దర్శకుడి ద్వారా బెల్లంకొండ గణేష్ ఎంట్రీ మూవీ మొదలు పెట్టారు. లాంచ్ ఈవెంట్ ను కూడా గట్టిగానే చేశారు. కానీ.. కారణం ఏంటో తెలియదుగానీ.. సినిమా ముందుకు సాగలేదు. మరి, మొదటి సినిమాతో రిమార్కు ఎందుకు అనుకున్నారో ఏమోగానీ.. ఆ ప్రాజెక్టును మళ్ళీ ముట్టుకోలేదు బెల్లంకొండ.

నా తమ్మున్ని చూస్తారు..
కాగా.. రీసెంట్ గా ఆ తమ్ముడి ఎంట్రీపై మాట్లాడిన శ్రీనివాస్.. వచ్చే ఏడాది తప్పకుండా సినిమా ఉంటుందన్నాడు. అదే తన బిగ్ డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. ఇక, శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ బాట పట్టనున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఒక వేళ వచ్చే ఏడాది తెలుగులో తన సినిమా లేకపోయినా తమ్ముడి సినిమా తప్పకుండా ఉంటుందన్నాడు శ్రీనివాస్. తనను కాకపోయినా.. తన తమ్ముడినైనా స్క్రీన్ పై చూస్తారని అన్నాడు.