Begin typing your search above and press return to search.
వి.వి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ 'ఛత్రపతి'..!
By: Tupaki Desk | 27 Nov 2020 12:15 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన 'ఛత్రపతి' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారని.. సాయి శ్రీనివాస్ ఈ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పుకున్నారు. తాజాగా 'ఛత్రపతి' హిందీ రీమేక్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. 'అల్లుడు శ్రీను'తో సాయి శ్రీనివాస్ ని టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.
ఫస్ట్ మూవీ 'అల్లుడు శ్రీను' నుంచి 'రాక్షసుడు' వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ప్రతి సినిమా కూడా హిందీలో డబ్ చేయబడి యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖ ఫిలిం మేకర్ జయంతిలాల్ టాలీవుడ్ యువ హీరోని బాలీవుడ్ లోకి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. దీని కోసం దర్శకధీరుడు రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్ లో 2014లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'ఛత్రపతి' సినిమాని ఎంచుకున్నారు. నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టు స్టోరీలో తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది.
వి.వి వినాయక్ ఇంతకముందు 'ఠాగూర్' 'ఖైదీ నెం. 150' వంటి సక్సెస్ ఫుల్ రీమేక్స్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు వినాయక్. హీరో బెల్లకొండ ఈ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఇది సరైన ప్రాజెక్ట్ అని.. డాక్టర్ జయంతిలాల్ మరియు పెన్ స్టూడియోస్ తో కలిసి పనిచేయడానికి ఆనందంగా ఉందని అన్నాడు. నా మొట్టమొదటి దర్శకుడు వి.వి.వినాయక్ తో తిరిగి కలవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానని.. ప్రభాస్ చేసిన పాత్రను పోషించడం చాలా పెద్ద బాధ్యత అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద టాలీవుడ్ కమర్షియల్ హీరో - కమర్షియల్ డైరెక్టర్ కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.