Begin typing your search above and press return to search.

'నేను స్టూడెంట్ సర్!' అంటున్న బెల్లంకొండ బ్రదర్..!

By:  Tupaki Desk   |   9 Sep 2022 6:42 AM GMT
నేను స్టూడెంట్ సర్! అంటున్న బెల్లంకొండ బ్రదర్..!
X
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, యంగ్ హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ మూవీ రిలీజ్ కాకముందే బెల్లంకొండ బ్రదర్ తన రెండో సినిమాని అనౌన్స్ చేసాడు.

గణేష్ హీరోగా ''నేను స్టూడెంట్ సర్!'' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్-2 గా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

SV2 బ్యానర్ లో ఇంతకుముందు వచ్చిన 'నాంది' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ''నేను స్టూడెంట్ సర్!'' వంటి యాక్షన్ థ్రిల్లర్‌ ను నిర్మిస్తున్నారు నిర్మాత 'నాంది' సతీష్ వర్మ.

దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథను అందించాడు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో స్పెషల్ థ్రిల్లర్‌ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈరోజు శుక్రవారం 'నేను స్టూడెంట్ సర్!' చిత్రానికి సంబంధించిన టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌ ను నిర్మాతలు రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో గాయాలతో ఉన్న గణేష్ ను తుపాకీలతో చుట్టుముట్టిన పోలీసులకు తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ ని చూపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ లా ఉంది. ఇక్కడ గణేష్ చాలా భయంతో కనిపిస్తున్నాడు.

'నాంది' మాదిరిగానే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే రెండో సినిమా కూడా ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్‌ గా ఉండబోతోందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని - సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ - ఆటో రాంప్రసాద్ - చరణ్‌ దీప్ - ప్రమోధిని - రవి సాయితేజ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అనిత్ మధాడి సినిమాటోగ్రఫీ అందించగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు.

ఇప్పటికే 'నేను స్టూడెంట్ సార్!' సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.