Begin typing your search above and press return to search.

టీనేజీ ప్రేమ‌క‌థ‌తో నిర్మాత రెండో వార‌సుడు?

By:  Tupaki Desk   |   14 Sept 2020 10:02 AM IST
టీనేజీ ప్రేమ‌క‌థ‌తో నిర్మాత రెండో వార‌సుడు?
X
నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీ‌నివాస్ టాలీవుడ్ హీరోగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న రెండో కుమారుడు .. సాయి శ్రీనివాస్‌ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ బాబు హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఇంత‌కు ముందు లాంఛనం గా సినిమా ప్రారంభమైంది. ఈ ఇందు లో `మజిలీ` సినిమాలో బాల‌న‌టిగా క‌నిపించిన‌ అనన్య అగర్వాల్‌ హీరోయిన్ గా నటించనుందని ప్ర‌చార‌మైంది. డెబ్యూ చిత్రం టీనేజ్‌ లవ్‌ స్టోరి అన్న టాక్ వినిపించింది.

అయితే ఇటీవ‌ల ఆ మూవీకి సంబంధించిన స‌రైన స‌మాచారం ఏదీ లేదు. నేడు బెల్లంకొండ గ‌ణేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ డెబ్యూ హీరో టాలీవుడ్ లో రాణించాల‌ని ఆశీస్సులు అందిస్తున్నారు. #HbdGaneshBellamkonda అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

తాజాగా బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజైన గ‌ణేష్ స్మార్ట్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. త‌న వ‌య‌సు లుక్ కి త‌గ్గ‌ట్టుగా ప్రేమ‌క‌థా చిత్రాల్లో యువ‌ హీరో రాణించే అవ‌కాశం ఉంది. అయితే న‌ట‌ వార‌సుల‌కు అన్ని వేళ‌లా ఛాన్సులుండ‌వు. ప్ర‌తిభ‌ తో రాణిస్తేనే ముందుకు సాగుతార‌న్న‌ది ప్రూవ్ అయ్యింది. గ‌ణేష్ త‌న‌ని తాను న‌టుడిగా ఇత‌ర విభాగాల్లో ఏమేర‌కు తీర్చిదిద్దుకున్నాడు? అన్న‌దే అత‌డి భ‌విత‌వ్యాన్ని నిర్ధేశిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.