Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఆలోచనలో జూనియర్ బెల్లంకొండ

By:  Tupaki Desk   |   3 Oct 2019 9:38 AM GMT
ఫస్ట్ లుక్: ఆలోచనలో జూనియర్ బెల్లంకొండ
X
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 వ తారీఖున గణేష్ డెబ్యూ సినిమాకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో గణేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నిర్మాతలు విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో సినిమా కథకు సంబంధించిన కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. టేబుల్ పై గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్.. ఆ బాటిల్ వెనక టేప్ రికార్డర్ క్యాసెట్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇది 1980.. 90 ల నేపథ్యం అనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హీరో ఆ టేబుల్ పై చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. చేతిలో ఒక స్కెచ్ పెన్..ముందేమో కొన్ని పుస్తకాలు మరికొన్ని స్కెచ్ పెన్లు ఉన్నాయి. హీరో ఇలా కనిపిస్తున్నాడంటే ఇక లవ్ లో ఉన్నట్టేనని మనం ఫిక్స్ అయిపోవాలి. పోస్టర్ కలర్ థీమ్ బాగుంది.

ఈ సినిమాకు 'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేమ్ పవన్ సాదినేని దర్శకుడు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్..రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ను బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్.. లక్కీ మీడియా వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.