Begin typing your search above and press return to search.

ఇంత ఆదరణ నేను ఊహించలేదు

By:  Tupaki Desk   |   11 Oct 2022 5:29 AM GMT
ఇంత ఆదరణ నేను ఊహించలేదు
X
బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి గణేష్ హీరోగా స్వాతిముత్యం సినిమా తో పరిచయం అయిన విషయం తెల్సిందే. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యింది. చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ మరియు నాగార్జున ది ఘోస్ట్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వాతిముత్యం సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. అయితే కలెక్షన్స్ విషయంలో కాస్త నిరాశ తప్పడం లేదు అంటూ టాక్ వచ్చింది.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సినిమాను సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ హీరో బెల్లంకొండ సాయి గణేష్ మరియు ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ లు మీడియాతో మాట్లాడారు.

మొదటి రెండు రోజులు వసూళ్లను చూసి భయపడ్డాం.. కానీ శుక్రవారం నుండి కలెక్షన్స్ పుంజుకున్నాయంటూ బెల్లంకొండ సురేష్ అన్నారు.

ఇక హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ... మంచి సినిమాను తీస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అంటూ మా స్వాతిముత్యం సినిమాతో మరోసారి రుజువు అయ్యింది. మా సినిమా ను పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడం జరిగింది. చిన్న సినిమా గా మేము వచ్చినప్పటికి శుక్రవారం నుండి కలెక్షన్స్ మెరుగు పడ్డాయి.

ఈ స్థాయి ఆధరణ నాకు దక్కుతుందని నేను ఊహించలేదు. ఇది నాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టడంతో పాటు మంచి సినిమాలను భవిష్యత్తులో చేసే బూస్ట్‌ ను ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగ వంశీ గారికి మరియు చినబాబు గారికి కృతజ్ఞతలు.

స్వాతి ముత్యం తో పరిచయం అయిన గణేష్ తన రెండో సినిమా నేను స్టూడెంట్‌ సర్‌ ను ఇప్పటికే మొదలు పెట్టాడు. త్వరలోనే ఆ సినిమాతో కూడా బెల్లంకొండ సాయి గణేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. మొదటి సినిమా తో పాజిటివ్‌ మార్కులు దక్కించుకున్న గణేష్ రెండవ సినిమా తో కమర్షియల్‌ గా బిగ్‌ సక్సెస్ ని దక్కించుకుంటాడేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.