Begin typing your search above and press return to search.

శ్రీలంక‌లో బెల్లంకొండ దంప‌తుల పెళ్లి వార్షికోత్స‌వం!

By:  Tupaki Desk   |   23 March 2022 6:32 AM GMT
శ్రీలంక‌లో బెల్లంకొండ దంప‌తుల పెళ్లి వార్షికోత్స‌వం!
X
టాలీవుడ్ నిర్మాత‌ల‌లో బెల్లంకొండ సురేష్ ప్ర‌స్తానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పలు హిట్ చిత్రాల్ని నిర్మించి సిన‌పిమాల‌పై ఫ్యాష‌న్ తో కుమారుల్ని సైతం ఇదే రంగంలోకి దించారు. పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవ‌లే చిన్న కుమారుడు గ‌ణేష్ కూడా మ్యాక‌ప్ వేసుకున్నారు.

'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. అంత‌కు ముందు నిర్మాణ రంగంలోనూ అనుభ‌వం సంపాదించాడు. ప‌లు సినిమాల‌కు ప్రొడ‌క్ష‌న డిపార్ట్ మెంట్ లో ప‌నిచేసాడు. ఆ ర‌కంగా మేక‌ప్ వేసుకోవ‌డానికి ముందే క‌ష్ట‌న‌ష్టాల్ని బేరీజు వేసే సామ‌ర్ధ్యాన్ని తండ్రి చిన్న కుమారుడికి ముందే క‌ల్పించారు. తాజాగా బెల్లంకొండ సుర‌ష్ దంప‌తులు 30వ పెళ్లి వార్షికోత్స‌వం పుర‌స్కరంచుకున్న స‌ద‌ర్భంగా త‌న‌యులిద్ద‌రు త‌ల్లిదండ్రులకు ఇన్ స్టా వేదిగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు.

ఈ వేడుక‌ల్ని ప్ర‌త్యేకంగా త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి శ్రీలంక‌లో జ‌రుపుకున్న‌ట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్‌-ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మ‌- కుమారులు శ్రీనివాస్-గ‌ణేష్ అంతా ఒకేచోట క‌లిసి దిగిన ఓ ఫోటోని ఇన్ స్టా వేదిగా శ్రీనివాస్ అభిమానుల‌కు షేర్ చేసాడు.

సురేష్ వైట్ అండ్ వైట్ దుస్తుల్ని ధ‌రించ‌గా... ప‌ద్మ సంప్ర‌దాయ సారీలో క‌నిపిస్తున్నారు. ఇక త‌న‌యులిద్ద‌రు బ్లాక్ అండ్ బ్లాక్ లో న‌వ్వులు చిందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. బెల్లంకొండ ఫ్యామిలీ ఫాలోవ‌ర్స్ అంతా ప్ర‌త్యేకంగా విషెస్ తెలియ‌జేస్తున్నారు.

ప్ర‌స్తుతం గ‌ణేష్ న‌టిస్తోన్న మూడు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. 'స్వాతిముత్యం' లాంచింగ్ మూవీకాగా.. యంగ్ మేక‌ర్ రాకేష్ ఉప్ప‌ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా..అలాగే ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు.

ఇక సాయి శ్రీనివాస్ 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ తో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అదే టైటిల్ తో తెర‌కెక్కిస్తున్నారు. 'స్టువ‌ర్ట్ పురం దొంగ' అనే మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు. నిర్మాత‌గా సురేష్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. 'శంభో శివ‌శంబో'..'బ‌స్టాప్'..'త‌డాఖా'..'అల్లుడు శీను'..'ర‌భ‌స' చిత్రాల్ని సురేష్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.