Begin typing your search above and press return to search.

ఇది నిజమే అయితే బెల్లంకొండ దశ తిరిగినట్లే

By:  Tupaki Desk   |   12 Nov 2020 4:40 PM IST
ఇది నిజమే అయితే బెల్లంకొండ దశ తిరిగినట్లే
X
టాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్‌ లో సినిమాకు రెడీ అవుతున్నాడని.. అది కూడా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన 'చత్రపతి' సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు అంటున్నారు. ప్రభాస్‌ ను కెరీర్‌ ఆరంభంలో స్టార్‌ హీరోగా నిలిపిన సినిమా చత్రపతి అనడంలో సందేహం లేదు. రాజమౌళి మార్క్‌ భారీతనంతో రూపొందిన ఆ సినిమాను హిందీలో బెల్లంకొండ బాబుతో నిర్మించేందుకు ఒక నిర్మాణ సంస్థ ఆసక్తిగా ఉందట.

ఈ యంగ్‌ హీరో నటించిన తెలుగు సినిమాలు జయ జానకి నాయక మరియు సీతలతో పాటు ఇతర సినిమాలు అన్ని కూడా హిందీలో డబ్‌ అయ్యి యూట్యూబ్‌ లో వందల మిలియన్‌ ల వ్యూస్‌ ను సొంతం చేసుకున్నాయి. కనుక హిందీలో ఈయనకు మంచి క్రేజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఆ కారణాల వల్లే ఈయన్ను హిందీ ప్రేక్షకుల ముందుకు డైరెక్ట్‌ గా తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నమ్మశక్యంగా లేవని.. ఒక వేళ ఈ వార్తలు నిజమే అయితే బెల్లంకొండ దశ తిరిగినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్‌ వ్యూస్‌ ను బట్టి కూడా హిందీలో హీరోగా అవ్వచ్చా అంటూ నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌ తెలుగు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అల్లుడు అదుర్స్‌ సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నభా నటేష్‌ హీరోయిన్‌ గా ఈ ఆ సినిమాలో నటిస్తోంది.