Begin typing your search above and press return to search.
గుర్తు పట్టండి : ఈ క్యూట్ మహత్మ ప్రస్తుతం మాస్ హీరో
By: Tupaki Desk | 3 Oct 2020 10:00 AM ISTగాంధీ జయంతి సందర్బంగా సినీ ప్రముఖులు మరియు ఇతరులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు చేశారు. కొందరు గాంధీజీ సూచించిన మార్గాలను పాటించాలంటూ ఆయన సూక్తులను పోస్ట్ చేయగా మరి కొందరు ఆయన రేర్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. కొందరు చిన్నప్పుడు తాము వేసిన గాంధీ వేషంను కూడా షేర్ చేసుకున్నారు. అలా ఈ హీరో కూడా తాను చిన్నప్పుడు గాంధీ వేషం వేసుకున్న ఫొటోను షేర్ చేశాడు. స్కూల్ లో ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్ లో భాగంగా ఎక్కువ మంది పిల్లలు గాంధీ వేషం వేస్తూ ఉంటారు. అలాగే ఈ మాస్ హీరో కూడా తాను వేసుకున్న గాంధీ వేషంను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.
పైన కనిపిస్తున్న క్యూట్ గాంధీ ఎవరో వెంటనే గుర్తు పట్టడం కష్టం కదా. వెంటనే కాదు అత్యధికులు అది ఎవరు అనేది చెప్పే వరకు కూడా గుర్తు పట్టలేరు. ఇంతకు అతడు ఎవరో తెలుసా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒక మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో. ఆయన మొదటి సినిమానే మాస్ చిత్రాల దర్శకుడు అయిన వివి వినాయక్ దర్శకత్వంలో చేశాడు. ఆ సినిమాలో సమంత మరియు తమన్నాతో రొమాన్స్ చేశాడు. కొత్త హీరో మొదటి సినిమాలోనే ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ అంటే మామూలు విషయం కాదు. అదో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. అంతటి రికార్డు దక్కించుకున్న ఆ హీరో ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది. ఔను అతడే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గాంధీ జయంతి సందర్బంగా తాను చిన్నతనంలో వేసుకున్న గాంధీ వేషంకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.